విశ్వంభర కాదు.. ఆ సినిమాతోనే అకీరా ఎంట్రీ?

ఓజీ మూవీతో అకీరాను ఇండస్ట్రీలోకి తీసుకురావాలన్న ప్లాన్ పవన్ ది కానట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ సుజిత్.. మొత్తం ప్లాన్ గీశారని సమాచారం. పవన్ కు చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి.

Update: 2024-10-19 23:30 GMT

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎందరో వారసులు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అకీరాకు మ్యూజిక్ పై మంచి ఇంట్రెస్ట్ ఉందని ఇప్పటికే అనేకసార్లు ప్రూవ్ అయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం అకీరాను హీరోగానే చూడాలనుకుంటున్నారు. ఎప్పుడు తెరంగేట్రం చేస్తారోనని ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం చదువుకుంటున్న అకీరా.. తన పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో సినిమాల్లోకి రానున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలిసింది. ఇప్పుడు తన నాన్న ఓజీ సినిమాతోనే డెబ్యూ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో అకీరా కీలక పాత్ర పోషిస్తారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఓజీ మూవీతో అకీరాను ఇండస్ట్రీలోకి తీసుకురావాలన్న ప్లాన్ పవన్ ది కానట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ సుజిత్.. మొత్తం ప్లాన్ గీశారని సమాచారం. పవన్ కు చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. అయితే ఓజీలో పవన్ కళ్యాణ్.. గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్.. ఆ విషయాన్ని పలుమార్లు తెలిపారు. ఇప్పుడు అకీరా.. ఓజీలో పవన్ చిన్నప్పటి రోల్ లో కనపడనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. సుజిత్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఓజీపై మంచి అంచనాలు ఉన్నాయని.. ఇప్పుడు అకీరా కూడా నటిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆకాశాన్ని తాకాయని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే.. మెగా అభిమానులకు బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులకు టైమ్ కేటాయిస్తున్నారు. దీంతో హరిహరవీరమల్లుతో పాటు ఓజీ సినిమా షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓజీ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయినట్టు సమాచారం. మరో ఓజీలో అకీరా నటిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News