సంక్రాంతి కొత్త బట్టల్లో అన్నా-చెల్లి!
భార్యభర్తలుగా వేరైనా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ తల్లిదండ్రులకు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారు అన్నది చెప్పాల్సిన పనిలేదు.
భార్యభర్తలుగా వేరైనా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ తల్లిదండ్రులకు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఏ పండగ వచ్చినా! అకీరా నందన్-ఆద్య ఇద్దరు హైదరాబాద్ లో పవన్ తోనే ఉంటారు. అక్కడ నుంచి చిరంజీవి-సురేఖల వద్దకు వెళ్తారు. ఆ రకంగా పెదనాన్న -పెద్దమ్మల ఆశీర్వా దాలు తీసుకుంటారు. పండుగలన్నీ వాళ్లతోనే సెలబ్రేట్ చేసుకుంటారు.
తాజాగా సంక్రాంతిని కూడా మెగా కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. మెగా- అల్లు ఫ్యామిలీతో కలిసి అకీరా-ఆద్య కూడా బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని అన్నాచెల్లెళ్లు ఇద్దరు కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు. ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై సంక్రాంతి అంతా మాదే అనిపించారు. అకీరా వైట్ కలర్ ప్యాంట్ ..సరాయిలో ముస్తాబవ్వగా..ఆద్య ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ లో కనిపిస్తున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో ఇద్దరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోని మామ్ రేణు దేశాయ్ తన ఇన్ స్టా ఖాతాలో అభిమానులకు షేర్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ పవన్ కళ్యాణ్ నటించిన `అన్నవరం` సినిమా లోని `అన్నయ్య అన్నావంటే` సాంగ్ ని జోడించారు. అన్నా-చెల్లి అనుబంధాన్ని తెలిపే ఆ పాట ద్వారా వాళ్లిద్దరి మధ్య బాండింగ్ ని రేణు మరోసారి రివీల్ చేసారు. ఈఫోటోని ఉద్దేశించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ పోస్ట్ చేసారు.
చివరకు రీల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో వాళ్ల నాన్న పాట ఇది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. పవన్ అభిమానుల్ని అన్నా-చెల్లి విశేషంగా ఆకట్టుకుంటు న్నారు. ప్రత్యేకంగా అకీరా ఫోకస్ అవుతున్నాడు. ఇప్పటివరకూ గెడ్డం..మీసంతో ఎక్కడా కనిపించలేదు. ఈ పిక్ లో ఆ రెండింటీలోనూ హైలైట్ అవుతున్నాడు.