అఖిల్ 6 సైలెంట్ గా ఎక్కించేసారా!
అక్కినేని వారసుడు అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కతుందంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.
అక్కినేని వారసుడు అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కతుందంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. `ఏజెంట్` తర్వాత ఒక్కసారిగా సైలైంట్ అయి పోయిన అఖిల్ తదుపరి సినిమా విషయంలో చాలా ఎనాలసిస్ చేసుకుని చివరిగా అఖిస్ 6గా `వినరో భాగ్యము విష్ణు కథ` ఫేం మురళీ కిషోర్ అబ్బూరితో ప్రాజెక్ట్ లాక్ అయింది. లైనిన్ అనేది వర్కింగ్ టైటిల్ గాను తెరపైకి వచ్చింది. అయితే సెట్స్ కి వెళ్లేది? ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ మొదలైందని సమాచారం. ఇందులో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో అఖిల్ ఎంతో సైలెంట్ గానే కనిపిస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా చిత్రం పట్టాలెక్కినట్లు కనిపిస్తుంది. అందుకు కారణం అతడి వైఫల్యాలు. ఇంతవరకూ కెరీర్ లో సరైన సక్సెస్ ఒక్కటీ లేదు. `ఏజెంట్` కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు.
బాడీని సిక్స్ ప్యాక్ లుక్ లోకి తీసుకొచ్చాడు. హెయిర్ స్టైల్ మార్చాడు. మొత్తంగా టాప్ టూ బాటమ్ కొత్త అఖిల్ నే అందులో పరిచయం చేసాడు. ఈ సినిమాతో స్టైలిష్ అఖిల్ అయిపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఫలితం మరోసారి తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో అఖిల్ ఇంకా విజయం కోసం తపించే హీరోల జాబితాలో కనిపిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే సక్సెస్ అందుకునే వరకూ అభిమానుల ముందుకు రాను..స్టేజ్ లు కూడా ఎక్కనని నాన్న నాగార్జునకు ప్రామిస్ చేసారు.
ఇచ్చిన మాట ప్రకారమే అఖిల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు.` లెనిన్` ప్రాజెక్ట్ ని కూడా అంత ఈజీగా ఫైనల్ చేయలేదు. తనతో పాటు ఫ్యామిలీ అంతా ఈప్రాజెక్ట్ కోసం కేరింగ్ తీసుకుంటుంది. హిట్ తోనే అకిల్ బాబు రావాలని కుటుంబం సహా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి? అన్నది ఇంత వరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు. ఇందులో అఖిల్ కి జోడీగా శ్రీలీల ఎంపికైంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.