అఖిల్.. మళ్ళీ అలాగే ఎందుకు?

అఖిల్ మళ్లీ రిస్క్ చేస్తున్నారని చెబుతున్నారు. బడ్జెట్ ఎంత ఉన్నా.. కంటెంట్ ముఖ్యం కదా అని అంటున్నారు.

Update: 2024-10-23 14:30 GMT

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి తొమ్మిదేళ్లు కంప్లీట్ అయిపోతున్నా ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అందుకోలేదన్న విషయం తెలిసిందే. అఖిల్ మూవీతో హీరోగా మారిన ఆయన.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఫస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కానీ కమర్షియల్ గా ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్.. గత ఏడాది ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. ఎలాంటి డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. సురేందర్ రెడ్డి మార్క్ కనిపించలేదని అప్పట్లో అనేక మంది రివ్యూస్ ఇచ్చారు. అయితే ఆ సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు మరో మూవీని అఖిల్ అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నా.. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. పైగా ఆయన లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం అఖిల్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై కొత్త దర్శకుడు అనిల్ కుమార్‌ తో కలిసి అఖిల్‌.. పీరియాడికల్ జోనర్ మూవీ చేయనున్నారని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయన చెప్పిన కథకు అఖిల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ ప్రాజెక్ట్ కోసమే హెయిర్‌ పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రీసెంట్ గా మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది.

వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ మరో మూవీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ పై తండ్రి, ప్రముఖ హీరో నాగార్జున నిర్మించనున్నారని టాక్ వచ్చింది. ఆ రెండింటిని త్వరలో అఖిల్ అనౌన్స్ చేయనున్నారని వినికిడి. అయితే ఆ రెండు ప్రాజెక్టులు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నాయని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

ఫుల్ వీఎఫ్ ఎక్స్ వర్క్ తో రెండు ప్రాజెక్టులు భారీగా స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అనేక మంది స్పందిస్తున్నారు. అఖిల్ మళ్లీ రిస్క్ చేస్తున్నారని చెబుతున్నారు. బడ్జెట్ ఎంత ఉన్నా.. కంటెంట్ ముఖ్యం కదా అని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందే చిత్రాల రిజల్ట్ ఎలా ఉన్నా పర్లేదని అభిప్రాయపడుతున్నారు. కానీ భారీ బడ్జెట్ సినిమాలకు రిస్క్ ఎక్కువ అని.. ఏజెంట్ మూవీతో అది ప్రూవ్ అయిందని అంటున్నారు. మళ్లీ ఇప్పుడు పెద్ద బడ్జెట్ తో సినిమాలు చేయడం ఎందుకని అఖిల్ ను అడుగుతున్నారు. తక్కువ బడ్జెట్.. మంచి స్టోరీ.. ఇలా ముందుకెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి అఖిల్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News