కింగ్ కి జోడీగా యంగ్ క్వీన్స్
కింగ్ నాగార్జున హీరోగా ప్రస్తుతం నా సామి రంగా అనే మూవీ తెరకెక్కబోతోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు
కింగ్ నాగార్జున హీరోగా ప్రస్తుతం నా సామి రంగా అనే మూవీ తెరకెక్కబోతోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. మలయాళీ హిట్ మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రీటీజర్ ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేశారు.
అయితే షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉందంట. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ఫైనల్ అవుతోంది. ఇందులో నాగార్జునకి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేసారంట. అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ అషికా రంగనాథ్ ఒక హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందంట.
అలాగే మిస్ ఇండియా మానస వారణాసిని సెకండ్ లీడ్ కోసం ఎంపిక చేసారంట. ఈ ఇద్దరు కూడా యంగ్ బ్యూటీస్ అని చెప్పాలి. ఓ విధంగా నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఏజ్ ఉంటుంది. ఆ యంగ్ బ్యూటీస్ ని కింగ్ నాగార్జున కోసం ఫైనల్ చేయడం విశేషమని చెప్పాలి. కింగ్ నాగార్జునకి జోడీగా నటించిన చాలా మంది హీరోయిన్స్ తరువాత స్టార్స్ గా మారిపోయారు.
మరి ఇప్పుడు మానస వారణాసి, ఆషికా రంగనాథ్ కూడా కింగ్ నాగార్జునతో నటించడానికి ఒకే చెప్పడం వెనుక ఈ కారణం ఏమైనా ఉందేమో చూడాలి. ఏది ఏమైనా ఈ వయస్సులో కూడా తీన్జ్ అమ్మాయిలతో కింగ్ నాగార్జున జోడీ కడుతూ ఉండటం ఇంటరెస్టింగ్ థింగ్ అని చెప్పాలి. ఇక నా సామి రంగా మూవీని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు ఉన్నాయి. అయితే నాగ్ కి సంక్రాంతి భాగా కలిసొచ్చే సమయం కావడంతో రేసులో ఉండటానికి ఆసక్తిగా ఉన్నారు. చివరిగా నాగ్ ది ఘోస్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్ట్ కాలేదు. మరి నా స్వామీ రంగా మూవీతో అయిన సక్సెస్ కొడతారో లేదో చూడాలి.