హిజ్రాల చప్పట్ల వెనక అసలు గుట్టు విప్పాడు!
హడ్డీ డైరెక్టర్ అక్షత్ అజయ్ శర్మ క్రాస్‌డ్రెస్సర్ల ప్రపంచం గురించి ఆసక్తికరమైన విషయాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హడ్డీ' సెప్టెంబర్ 5న ZEE5లో విడుదలైంది. ఈ చిత్రంలో నవాజ్ ఒక లింగమార్పిడి మహిళ (హిజ్రా)గా ఛాలెంజింగ్ క్యారెక్టర్‌ని పరిపూర్ణతతో పోషించారని టాక్ వినిపిస్తోంది. లింగమార్పిడి వ్యక్తుల జీవితకథలను ఇటీవలి అధునాతన సమాజం ఎక్కువగా అంగీకరిస్తున్నందున, ప్రత్యేకించి హిజ్రాల్లో కిన్నార్ కమ్యూనిటీ ప్రత్యేక సంస్కృతి.. కమ్యూనికేషన్ పద్ధతులకు కూడా గుర్తింపు పెరుగుతోందని ఈ చిత్రంలో సందేశం ఇవ్వడం ఆసక్తికరం.
హడ్డీ డైరెక్టర్ అక్షత్ అజయ్ శర్మ క్రాస్‌డ్రెస్సర్ల ప్రపంచం గురించి ఆసక్తికరమైన విషయాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసారు. ఇక్కడ క్లాప్ (చప్పట్ల)లను రహస్య కోడ్‌గా .. కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగిస్తారు. గుప్తి లేదా అల్టి వ్యాసా అని పిలవబడే ఈ విలక్షణమైన కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి ఇప్పటి వరకు ప్రజలకు పూర్తి వివరం తెలియనే తెలీదు. ఇది రహస్యంగా దాగి ఉంది. క్రాస్‌డ్రెస్సింగ్ కమ్యూనిటీలో ఈ తరహా వ్యక్తీకరణ కనెక్షన్ రూపంగా పరిణామం చెందింది. ఒకరితో ఒకరు సంభాషించుకునే విధానానికి ఇది రూపకం.
గుప్తి ప్రాంతీయంగా సూక్ష్మ నైపుణ్యాల కలబోతగా ఉంటుంది. సమాజ సంస్కృతి లోతు వైవిధ్యానికి నిదర్శనంగా పనిచేస్తుంది. ఈ కమ్యూనిటీలో రెండు వర్గాల వ్యక్తులు ఉన్నారని గమనించడం ముఖ్యం. ఫార్సీలో కమ్యూనికేట్ చేసేవారు ఒక రకం.. గుప్తిని ఉపయోగించేవారు ఇంకో రకం. దీని గురించి దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ ప్రస్థావిస్తూ..''గుప్తీ భాష ఈ సంఘం తాలూకా శక్తివంతమైన సంస్కృతిని అన్వేషించడం నాకు డెప్త్ తో కూడుకున్న వ్యక్తిగత ప్రయాణం.
ఈ చిత్రం హృదయం ఆత్మ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆధారపడి ఉంది. ఒక విభిన్నమైన ప్రపంచాన్ని తెరపైకి తీసుకురావడానికి నేను విస్తృతమైన పరిశోధనకు నన్ను నేను అంకితమిచ్చాను. శ్రమతో కూడిన పరిశోధన వారి జీవితాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడంతోనే ప్రతిదీ తెలిసాయి. చప్పట్లు కొట్టడం అనేది రహస్యంగా మిగిలిపోయిన భాష. దీని ద్వారా కమ్యూనికేషన్ అనే ఆసక్తికరమైన ప్రపంచాన్ని కనుగొన్నాం. మన సమాజంలో నిక్షిప్తమైన సంపదలను వెలుగులోకి తెచ్చే శక్తికి ఇది నిదర్శనం అని కూడా విశ్లేషించారు.
ఈ చిత్రంలో రేవతి 'మా' అనే కీలక పాత్రను పోషించారు. హడ్డీ చిత్రం కోసం పనిచేస్తున్నప్పుడు ఈ సమాజంలోని అద్భుతమైన వ్యక్తుల గురించి తెలుసుకోవడం ఆసక్తిని కలిగించిందని రేవతి ఈ సందర్భంగా అన్నారు. నేను ఈ కమ్యూనిటీ శక్తివంతమైన సంస్కృతి .. ప్రత్యేకమైన కమ్యూనికేషన్‌ను పరిశోధించినప్పుడు ప్రామాణికత -ఐక్యత అనే శక్తిని వారి నుంచి గ్రహించాను. గుప్తి కమ్యూనికేషన్ దాపరికంతో కూడిన కోడ్‌గా గుర్తించాను.
హిజ్రాల అచంచలమైన ఆత్మవిశ్వాసం స్థితిస్థాపకతను తెలుసుకున్నాను. వారు నిస్సందేహంగా ఉండటం .. అందాన్ని సెలబ్రేట్ చేయడంలో ప్రాముఖ్యతను నాకు చూపించారు. హడ్డీ కేవలం సినిమా కాదు... ఇది వారి బలానికి నివాళి... మనమంతా మానవత్వంతో మెలగాలని సూచించే సిరీస్ ఇది అని తెలిపారు. హడ్డీలో మహ్మద్ జీషన్ అయ్యూబ్, సౌరభ్ సచ్‌దేవా, శ్రీధర్ దూబే, రాజేష్ కుమార్, విపిన్ శర్మ, సహర్ష్ శుక్లా సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంజయ్ సాహా- రాధిక నందా బ్యానర్ ఆనందితా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.