ఇండిపెండెన్స్ గిఫ్ట్.. అక్షయ్ కుమార్‌కి భారత పౌరసత్వం

స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తనకు భారత పౌరసత్వం లభించినట్లు ప్రకటించారు

Update: 2023-08-15 09:06 GMT

స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తనకు భారత పౌరసత్వం లభించినట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో అక్షయ్ భారత పౌరసత్వానికి సంబంధించిన అధికారిక పత్రాలను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ ఫోటోను షేర్ చేశాడు. ఈ ప‌త్రాల్లో ఎరుపు రంగు ఫోల్డర్‌పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్‌షిప్ అని ముద్రించి ఉంది. త‌న పేరును హైలైట్ చేసే పత్రాన్ని చూపించాడు. అక్షయ్ హరిఓం భాటియా అత‌డి పూర్తి పేరు. తండ్రి మరియు తల్లి పేర్లు... భార్య ట్వింకిల్ ఖన్నా పేరు కూడా ఉంది. పుట్టిన ప్రదేశం ఢిల్లీ అని రాసి ఉంది. అక్ష‌య్ ఇప్ప‌టివ‌ర‌కూ కెనడియన్ జాతీయ‌త‌ను క‌లిగి ఉన్నాడు. ద్వంద్వ పౌర‌స‌త్వాన్ని క‌లిగి ఉన్నా ఇప్పుడు అందులోంచి ఒక‌టి వ‌దులుకున్నాడు.

సిటిజన్‌షిప్ యాక్ట్, 1955లోని సెక్షన్ 5(1) (జి) నిబంధన ప్రకారం భారతదేశ పౌరుడిగా అక్ష‌య్ పేరు నమోదు అయింది. ''దిల్ ఔర్ పౌరసత్వం, దోనో హిందుస్తానీ. స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!'' అని అక్షయ్ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టారు. 2011 కెనడియన్ ఫెడరల్ ఎన్నికల సమయంలో అక్కడి పరిరక్షణ ప్రభుత్వం అక్షయ్‌కి కెనడియన్ పౌరసత్వాన్ని మంజూరు చేసింది. అత‌డు కెనడాలోని అంటారియోలోని విండ్సర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. 2010లో ఎకనామిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ద్వంద్వ పౌరసత్వం ఉందని పేర్కొన్నాడు.

డిసెంబర్ 2019లో తాను భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తన కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకోవాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ వార్త ఇంటర్నెట్‌లో పెనుతుఫానుగా మారింది. అక్షయ్ ప్రకటనపై అభిమానులు ప్రేమను కురిపించారు. ''బ్రో భారతీయ పౌరసత్వాన్ని చూపించాడు..అభినందనలు.. అక్కీ సర్ ఆప్ హిందూస్తాన్ కే దిలో మే ధడక్తే హైం, యే కాగజ్ తో సిర్ఫ్ మొహర్‌స్త్ హైన్ జై హింద్'' అంటూ రాసారు. అక్షయ్ చివరిగా న‌టించిన OMG 2 మిశ్ర‌మ స్పంద‌న‌ల‌ను రాబ‌ట్టింది. ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ-బడే మియాన్ చోటే మియాన్హే-హేరా ఫేరి 3 చిత్రాల్లో అత‌డు న‌టిస్తున్నాడు. సుధ కొంగ‌ర తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'సూరరై పొట్రు' హిందీ రీమేక్ లో అక్కీ న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News