హీరో కంటే గెస్ట్ రోల్ హిట్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు.

Update: 2024-08-16 05:34 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఏడాదికి 4 నుంచి 6 సినిమాల వరకు అక్షయ్ కుమార్ నుంచి థియేటర్స్ లోకి వస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఇప్పటికే బడే మియాన్ చోటే మియాన్, సర్ఫిరా సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. ఆగష్టు 15న ఖేల్ ఖేల్ మే మూవీతో మరోసారి ఆడియన్స్ ని పలకరించారు. అయితే ఈ సినిమాకి కూడా డివైడ్ టాక్ వచ్చినట్లు బిటౌన్ లో వినిపిస్తోంది.

ఖేల్ ఖేల్ మే చిత్రానికి ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. సినిమాకి 100 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 5 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమాకి ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ లభించిందో చెప్పొచ్చు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్న కూడా కనీసం మినిమమ్ బుకింగ్స్ జరగలేదని అర్ధమవుతోంది. ఈ కలెక్షన్స్ కూడా కేవలం మల్టీప్లెక్స్, ప్రధాన నగరాల్లోనే వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన వేదా సినిమాకి కూడా మొదటి రోజు 6 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. హీరో రేంజ్ బట్టి చూసుకుంటే 6 కోట్లు కలెక్షన్స్ అంటే చాలా తక్కువ అని చెప్పాలి. అయితే బీ,సి సెంటర్స్ లో ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. యాక్షన్ మూవీ కావడంతో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. బడ్జెట్ పరంగా చిన్న సినిమాగా వచ్చిన స్త్రీ2 మూవీ మాత్రం మొదటి రోజు ఏకంగా 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇది నిజంగా రికార్డ్ అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న హిందీ సినిమా అంటే స్త్రీ2 అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించారు. దీంతో ఇప్పుడు అక్షయ్ కుమార్ అరుదైన ఫీట్ అందుకున్నారు. ఒకే రోజు అతను నటించిన రెండు సినిమాలలో ఒకటి డిజాస్టర్ టాక్ తో లోయెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకుంటే మరొకటి బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇలాంటి రికార్డ్ ని అందుకోలేదు. అయితే అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ చేసిన మూవీ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు అతని సినిమాల మార్కెట్ పై బిటౌన్ లో టెన్షన్ మొదలైంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ నుంచి 6 సినిమాలు థియేటర్స్ లోకి రాగా ఒక్క OMG2 మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. మిగిలిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ అయ్యాయి.

Tags:    

Similar News