డిజాస్టర్ స్టార్.. రాంగ్ వ్యక్తులతో పని చేయడమే కారణమా?
బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ అరడజను డిజాస్టర్లను అందించాడు.
బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ అరడజను డిజాస్టర్లను అందించాడు. ఇటీవల విడుదలైన `బడే మియాన్ చోటే మియాన్` అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. పంపిణీవర్గాలు సహా ఎగ్జిబిటర్లకు ఈ సినిమా వల్ల తీవ్ర నష్టాలొచ్చాయి. దాదాపు 250 కోట్ల మేర నష్టాలను ఎదుర్కొన్నారని కథనాలొచ్చాయి. ఈ సినిమాకి ముందు ఏకంగా ఐదు సినిమాలు పెద్ద ఫ్లాపులయ్యాయి.
అయితే అక్షయ్ కెరీర్ డౌన్ ఫాల్ వెనక వైఫల్యాల వెనక కారణాలను అతడి స్నేహితుడు, ఫిలింమేకర్ అనీష్ బజ్మి విశ్లేషించారు. చిత్ర పరిశ్రమ పోస్ట్ పాండమిక్ నెమ్మదిగా సర్దుబాటు దశలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో అక్షయ్ కుమార్ తన బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో దర్శకనిర్మాత అనీస్ బజ్మీ తన స్నేహితుడు అక్షయ్ ఇటీవలి వరుస పరాజయాలను విశ్లేషించారు. వాటికి వివిధ కారణాలను ఆపాదించారు. సూపర్ హిట్ల నటుడిగా పేరున్న అక్షయ్ కుమార్‌కు మహమ్మారి పూర్వపు ఖ్యాతి అసాధారణమైనది. కానీ మహమ్మారీ తర్వాత పరిస్థితి మారింది. అతడి ఇటీవలి ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్నాయని.. అతడి బాక్సాఫీస్ పనితీరు హెచ్చుతగ్గుల వెనుక కారణాలున్నాయని విశ్లేషించారు.
అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ పతనాన్ని దర్శకుడు అనీస్ బజ్మీ విశ్లేషించారు. ''అతడు రాంగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకున్న సందర్భాలు ఉండవచ్చు…''అని వ్యాఖ్యానించారు. ఖిలాడీ కుమార్‌కు శాశ్వతమైన కీర్తి, అసాధారణమైన స్టార్‌డమ్.. అద్భుత నైపుణ్యాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కెరీర్‌లో తగ్గుదల ఉంటుందని విశ్లేషించారు. చిత్ర పరిశ్రమలో జయాపజయాలు వచ్చి వెళుతుంటాయని అన్నారు. గెలుపోటముల చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుందని అన్నారు. అక్షయ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞను బజ్మి మెచ్చుకున్నారు.. అయితే స్క్రిప్ట్ ఎంపికలో తప్పటడుగులు వేయడం వలన నెగెటివ్ ఫలితాలకు కారణమై ఉండొచ్చని కూడా అన్నారు. ''అతడు రాంగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకున్నాడు లేదా అతడి ప్రతిభకు న్యాయం చేయని రాంగ్ వ్యక్తులతో పని చేసి ఉండవచ్చు. నాకు ఖచ్చితమైన కారణం తెలియదు`` అని అన్నాడు.
వెల్‌కమ్ -సింగ్ ఈజ్ కింగ్ వంటి చిత్రాలకు అక్షయ్ కుమార్- అనీష్ బజ్మి కలిసి పని చేసారు. ఆ సమయంలో సవాళ్లను గుర్తించినప్పటికీ అక్షయ్ కుమార్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు షేర్ చేస్కున్న సుసంపన్నమైన అనుభవాలకు బజ్మీ కృతజ్ఞతలు తెలిపారు. బాజ్మీ తదుపరి ప్రాజెక్ట్ భూల్ భూలయా 3 చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రం అక్షయ్ కి పూర్వ వైభవం తెస్తుందని ఆశిస్తున్నారు.
అరడజను ఫ్లాపులున్నా కానీ..!
అక్షయ్ కుమార్ కి అరడజను పైగా ఫ్లాపుల ఎదురైనా కానీ..ఈ ఏడాది మరో ఐదు విడుదలలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ సర్ఫిరా జూలై 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తమిళ చిత్రం సూరరై పొట్రుకి రీమేక్. సుధా కొంగర దర్శకత్వం వహించారు. `ఖేల్ ఖేల్ మే` చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. స్కై ఫోర్స్ షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 2 న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ వెల్‌కమ్ ఫ్రాంచైజీలో అక్షయ్ ఒక నటడిగా ఉన్నారు. అలాగే బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ `వెల్‌కమ్ 3` క్రిస్మస్ 2024 విడుదలకు విడుదల కానుంది. అతిథి పాత్రలో నటించిన సింగం ఎగైర దీపావళికి విడుదల కానుంది.