కిలాడీ కమిట్ మెంట్ ..డెడికేషన్ ఇలా ఉంటుంది!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పరాజయాల పరంపర గురించి తెలిసిందే. వరుసగా 16 ప్లాప్ లతో ఏకంగా రికార్డు సృష్టించారు
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పరాజయాల పరంపర గురించి తెలిసిందే. వరుసగా 16 ప్లాప్ లతో ఏకంగా రికార్డు సృష్టించారు. ఇంతవరకూ ఇన్ని వరుస వైఫల్యాలు ఏహీరో చూడలేదు. ఆ రకంగా బాలీవుడ్ లో ఇదో రికార్డు అని చెప్పాలి. ఇక అక్షయ్ ప్లాప్ ల గురించి నెట్టింట ట్రోలింగ్, విమర్శల గురించి తెలిసిందే. ఈ విషయంలో అక్షయ్ ఎంతో బాధపడ్డాడు. తన మనోవేదనని ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేసారు.
అటుపై బాధని వీడి, ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఎలా పనిచేయాలి? అన్న దానిపై సైతం పెద్ద క్లాస్ తీసుకున్నాడు. తానెంత బలవంతుడు అన్నది మాటల ద్వారా చెప్పేప్రయత్నం చేసాడు. తాజాగా మరోసారి తన సామర్ధ్యం గురించి చెప్పకనే చెప్పాడు. త్వరలో ` ఖేల్ ఖేల్ మే` తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు . ఈసందర్భంగా మరోసారి అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
`నేను చెప్పేది ఒక్కటే. ఏది జరిగినా? అదంతా మంచికే. నేను అతిగా ఆలోచించను. నాగురించి సోషల్ మీడియాలో ఎన్నో మేసెజ్ లు వస్తున్నాయి. ‘క్షమించండి మిత్రమా, చింతించకండి’ అని నాకు చాలా సందేశాలు వచ్చాయి. ఒక జర్నలిస్ట్ కూడా ఇలా వ్రాశాడు. చింతించ కండి, మీరు తిరిగి వస్తారన్నారు. నేను అతనిని పిలిచి వెనుక బడటం అంటే ఏంటి అని అడిగాను. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఇక్కడ ఉన్నాను. నేను పని చేస్తూనే ఉంటాను. ప్రజలు నా గురించి ఏమి చెప్పినా నేను పని చేస్తూనే ఉంటాను.
నేను ఉదాయన్నే నిద్రలేచి వ్యాయామం చేయడానికి వెళ్లిపోతాను. అక్కడ నుంచి నేరుగా ఇంటికి వస్తాను. ఇది నాకెంతో ఇష్టమైన పని. నేను ఏం సంపాదించినా సొంతంగా సంపాది స్తాను. నేనెప్పుడూ ఎవరి దగ్గరా ఏమీ తీసుకోను. నన్ను ఓవైపు షూట్ చేస్తూన్నా కింద పడే వరకూ పనిచేస్తూనే ఉంటాను. ఇది నా నైజం. నన్ను కింద పడేయడం అంత ఈజీ కాదు` అని అన్నారు.