22ఏళ్ల తర్వాత కమల్ హాసన్ మూవీ రీరిలీజ్
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన `ఆళవంధన్` నాటి మేటి క్లాసిక్ చిత్రాలలో ఒకటి.
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన `ఆళవంధన్` నాటి మేటి క్లాసిక్ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2001లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
అదే విషయాన్ని ప్రకటిస్తూ దర్శకుడు సురేష్ కృష్ణ సోషల్ మీడియాల్లో ఇలా రాసారు. ``ఆళవంధన్ 22 సంవత్సరాల వేడుకలు- ఒక కల్ట్ క్లాసిక్ - ఏకైక ఉలగనాయగన్ కమల్ హాసన్`` అని వ్యాఖ్యను జోడించారు. `ఆళవంధన్`లో కమల్ హాసన్ కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేయగా, రవీనా టాండన్, మనీషా కొయిరాలా కథానాయికలుగా నటించారు. కమల్ హాసన్ విలన్ గా, హీరోగా రెండు పాత్రలతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. జీవితం గురించి భిన్నమైన భావజాలం కలిగిన కవల సోదరుల గురించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహేష్ మహదేవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, శంకర్-ఎహసాన్-లాయ్ పాటలు స్వరపరిచారు. ఆళవందన్సినిమా తెలుగు అభయ్ గా అనువాదమై తెలుగులోను విడుదలైంది. ఇప్పుడు ఈ మూవీ రీ రీరిలీజ్ కు రెడీ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అభయ్ సినిమాకు కమల్ హాసన్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
కమల్ అజేయమైన కెరీర్ జర్నీ:
కమల్ హాసన్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో శంకర్ `భారతీయుడు 2` చిత్రం 2023-24 సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎట్టకేలకు ఈ సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని, తొలి కాపీ రెడీ అంటూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇటీవల ప్రకటించడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఈ సీక్వెల్‌లో విశ్వనటుడు కమల్ హాసన్ సేనాపతిగా తన పాత్రను తిరిగి పోషిస్తుండడం ఆసక్తికరం. భారతీయుడు 2 చిత్రం మొదటి భాగం కథతో కనెక్టివిటీ ఉన్నది. 1996 బ్లాక్ బస్టర్ కి ఫక్తు సీక్వెల్ కథతో కాకున్నా, ఇది యూనిక్ టచ్ తో అలరిస్తుందని ఇంతకుముందే శంకర్ వెల్లడించారు. చాలా సంవత్సరాల తర్వాత శంకర్ -కమల్ హాసన్ తిరిగి కలిసి పని చేస్తుండడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, గురు సోమసుందరం, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, రవి వర్మన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ విక్రమ్ (2022)లో చివరిసారిగా కనిపించిన కమల్ హాసన్ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 AD, హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న KH 233 .. మణిరత్నం దర్శకత్వంలో KH 234 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. KH 234 చిత్నం 1987 క్లాసిక్ ఫిల్మ్ నాయకన్ తర్వాత లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ .. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నమ్ ల రెండవ చిత్రం థగ్ లైఫ్ టైటిల్ ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే ఆకట్టుకుంది.