ఫోటో స్టోరి: విరహంలో నటవారసులు..!
అలయ ఎఫ్ ఆరంభం సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన 2020 కామెడీ-డ్రామా చిత్రం 'జవానీ జానేమాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది
అందం ఉంది .. వేడి ఉంది..ఆటా పాటతో వేడెక్కించే వయసు ఉంది.. అవకాశాలిచ్చే నిర్మాతలు ఉన్నారు. కానీ ఏం లాభం? ఈ బ్యూటీ గడిచిన నాలుగేళ్లలో ఏం సాధించింది? అంటే రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంది. బాలీవుడ్‌లో నాలుగేళ్ల కష్టం గురించి అలయ ఎఫ్ తాజాగా ఓపెనైంది. ఇది కష్టతరమైన పరిశ్రమ అని తెలిపింది. నేను ప్రశంసలు అందుకున్నందుకు సంతోషంగా ఉందని, కరోనా క్రైసిస్ మూడేళ్ల కెరీర్ ని తినేసిందని కూడా వ్యాఖ్యానించింది.
అలయ ఎఫ్ ఆరంభం సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన 2020 కామెడీ-డ్రామా చిత్రం 'జవానీ జానేమాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభమై నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆలయ తన కెరీర్ గురించి మీడియాతో మాట్లాడింది.
కరోనావైరస్ మహమ్మారికి ముందు తన అరంగేట్రం గురించి అలయ మాట్లాడుతూ..మహమ్మారి తరువాత, మొత్తం పరిశ్రమ అతలాకుతలం అయింది. మొత్తం కొత్త ప్రపంచంగా మారింది. ఏది పని చేస్తుందో, ఏది పని చేయదో తెలీని స్థితి. ప్రజలు ఎక్కువ కాలం థియేటర్లకు రాలేదు. లాక్‌డౌన్‌కు ముందు నా తొలి చిత్రం విడుదలైనందుకు నిజంగా నేను కృతజ్ఞురాలిని. ఆ సినిమాపై నాకున్న ప్రేమ మొత్తాన్ని మూడేళ్ల పాటు మోశాను. లేకుంటే ఆ మూడేళ్లు నన్ను ముంచేసేవే. ఇలా చెప్పుకుంటూ పోతే, నేను ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. నా మొదటి సినిమా, రెండో సినిమాల మధ్య మూడేళ్లు గ్యాప్ ఉండడంతో రెండేళ్లు అసలు ఏం చేసానో కూడా తెలీదు. ఇది ఆదర్శం కాదు.. కానీ కరోనా అనంతరం మళ్ళీ ప్రతి ఒక్కరూ తమ స్వంత ప్రయాణాలతో బిజీ అయ్యారు... అని తెలిపింది.
సినీఆరంగేట్రంలో సాంప్రదాయేతర పాత్రతో అరంగేట్రం చేయడం గురించి మాట్లాడుతూ, ఈ పాత్రతో తన పేరు మార్మోగిందని ఈ చిత్రం టైలర్ మేడ్‌గా అనిపించిందని చెప్పింది. నిజ జీవితంలో ఆ పాత్ర నాకు చాలా నచ్చింది! అని అంది.
ఇన్‌సైడర్ కి అవకాశాలు రావడం సులువా కష్టమా? అన్నదాని గురించి మాట్లాడింది. తాను ఇన్ సైడర్ అయినా కానీ ప్రజలు తన నటనను ఇష్టపడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇలాంటి విషయాలు ఎల్లప్పుడూ గడబిడగా ఉంటాయి. ఇది కఠినమైన పరిశ్రమ. ప్రతి ఒక్కరూ తమ మార్గంలో పోరాడాలి. నా సినిమాలన్నింటిలో నా పెర్ఫార్మెన్స్, నా వర్క్ కి చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. నేను చేయవలసింది చేస్తున్నాను. ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నారు. నేను నిరూపించడానికి ఇంకా ఏమి కావాలి? అని అంది.
మీ సమకాలీనులతో పరిశ్రమలో పోటీ ఉందా? అని అడిగినప్పుడు అలయ ఇలా అంది. ''నేను చాలా పోటీ ప్రపంచంలో ఉన్నాను.. కానీ అది నాలో ప్రతికూల భావోద్వేగం కాదు. అందరూ బాగా రాణించాలని నేను కోరుకుంటున్నాను.. కానీ నేను మరింత మెరుగ్గా చేయాలనుకుంటున్నాను. నేను నా పోటీ స్వభావాన్ని నన్ను నేను ప్రేరేపించడానికి ఇంధనంగా ఉపయోగించుకుంటాను. పోటీపడే తత్వం ఎల్లప్పుడూ నన్ను మెరుగ్గా ఉంచుతోంది. నేను నిజంగా మంచి పనిని చాలా గట్టిగా నమ్ముతాను. మనం ప్రజల విషయంలో దయతో ఉంటే .. మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. నేను దాని ఆధారంగా జీవిస్తున్నాను.
అలయ ఎఫ్ తదుపరి అక్షయ్ కుమార్ -యు టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించిన బడే మియాన్ చోటే మియాన్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలలో ఆలయ ఇతర భామల కంటే స్పీడ్ గా ఉంది. తాజాగా మిరుమిట్లు గొలిపే ఛమ్కీల దుస్తుల్లో ఆలయ మతులు చెడగొడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి.