ఆలియా దీపిక‌ను వెన‌క్కు నెట్టి సమంత నం.1

తమ అద్భుతమైన పనిత‌నంతో నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో పాటు మీడియా దృష్టిని త‌మ‌వైపు తిప్పేసుకోవ‌డం వారి ప్ర‌త్యేక‌త‌.

Update: 2024-10-22 15:00 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక‌రిని మించిన ప్ర‌తిభావంతులు ఒక‌రు. అందం న‌ట‌న డ్యాన్సులు ఫ్యాష‌న్ సెన్స్ బోల్డ్ నెస్ తెలివితేట‌లు ఇలా అన్ని కోణాల్లో ఔరా! అనిపించే భామ‌ల‌కు కొద‌వేమీ లేదు. తమ అద్భుతమైన పనిత‌నంతో నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో పాటు మీడియా దృష్టిని త‌మ‌వైపు తిప్పేసుకోవ‌డం వారి ప్ర‌త్యేక‌త‌.

సెప్టెంబరు 2024 నాటికి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన న‌టీమ‌ణులకు సంబంధించి ఓర్మాక్స్ మీడియా తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఊహించ‌ని విధంగా ద‌క్షిణాది భామ‌ల హవా కొన‌సాగింది. సౌత్ నటీమణులు మరోసారి తమ బాలీవుడ్ ప్రత్యర్ధులను అధిగమించి, మొదటి పది స్థానాల్లో ఆరు స్థానాలను దక్కించుకున్నారు. జాబితాలో అగ్రస్థానంలో దక్షిణ భారత సంచలనం సమంతా రూత్ ప్రభు, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా నటిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఓవైపు నాగ‌చైత‌న్య‌తో విడాకుల నేపథ్యంలో వ్య‌క్తిగ‌త క‌ల‌త‌, అనారోగ్య సమస్యల కారణంగా వృత్తిపరమైన విరామంలో ఉన్న సమంతకు తాజా విజయం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. పరిమితమైన ప్రదర్శనలతోనే ఆలియా భట్, దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ ప‌వ‌ర్ ఫుల్ హీరోయిన్ల‌ను అధిగమించి అగ్ర స్థానానికి చేరుకుంది.

చూస్తుంటే స‌మంత పాపులారిటీ అంత‌కంత‌కు పెరుగుతోంది. గ్లోబల్ సిరీస్ `సిటాడెల్` ఫ్రాంచైజీ భారతీయ స్పిన్-ఆఫ్ అయిన `సిటాడెల్: హనీ బన్నీ`లో న‌టించడం కూడా స‌మంత క్రేజ్ ను మ‌రింత పెంచింది. హ‌నీ బ‌న్నీ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్. ఇది విడుదలకు సిద్ధమవుతున్నందున స‌మంత‌ విజయానికి ఆలంబ‌న‌గా నిలిచింది. 7న‌వంబర్ 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కోసం హ‌నీ బ‌న్నీ సిద్ధ‌మ‌వుతోంది. ఈ సిరీస్ ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లై ఆక‌ట్టుకుంది. అగ్రశ్రేణి స్టార్‌గా సమంత స్థానాన్ని పదిలం చేయ‌డంలో హ‌నీ బ‌న్నీ స‌హ‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

టాప్ 10లో దక్షిణ భారత నటీమణులు నయనతార, త్రిష కృష్ణన్, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, రష్మిక మందన్న పేర్లు కూడా ఉన్నాయి. సమంత త‌రవాత వీరంతా ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో బాలీవుడ్ నుంచి అలియా భట్, దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ జాబితాలో స్థానం సంపాదించుకోవడంతో బాలీవుడ్ తన గౌర‌వాన్ని కాపాడుకుంది.

అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 దేశీ నాయిక‌లు-2024 వివ‌రాల్లోకి వెళితే... 1.సమంత రూత్ ప్రభు, 2.అలియా భట్, 3.దీపికా పదుకొనే, 4.నయనతార, 5.త్రిష కృష్ణన్, 6.శ్రద్ధా కపూర్, 7.కాజల్ అగర్వాల్, 8.సాయి పల్లవి, 9.రష్మిక మందన్న, 10.కియారా అద్వానీ.

Tags:    

Similar News