ఆలియా 'చుట్టమల్లె'.. ఎంత క్యూట్ గా పాడిందో!

'చుట్టమల్లె చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు..' అంటూ సాగే దేవర మూవీ సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-24 14:58 GMT

'చుట్టమల్లె చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు..' అంటూ సాగే దేవర మూవీ సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమాలోని రొమాంటిక్ సాంగ్.. తొలిసారి వినగానే అనిరుధ్ రవిచందర్ మంచి మెలోడీ ఇచ్చారని ప్రశంసించారు. ఆ తర్వాత అలా వింటుంటే భలే ఉందని కొనియాడారు. అలా సాంగ్ కు ఫిదా అయ్యారు. రిపీటెడ్ మోడ్ లో విన్నారు. దీంతో రిలీజ్ అయిన తక్కువ టైమ్ లో వేరే లెవెల్ లో వ్యూస్ దక్కించుకుంది చుట్టమల్లె సాంగ్.

సోషల్ మీడియాలో ఆ సాంగ్ కు రీల్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది. అనేక మంది ఫేవరేట్ మ్యూజిక్ లిస్ట్ లోకి చేరిపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. తెలుగులో చుట్టమల్లె సాంగ్ పాడింది. స్వీట్ వాయిస్ తో ప్రొఫెషనల్ సింగర్ లా ఆలపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆలియా.. వాయిస్ అదిరిపోయిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. చాలా బాగా పాడిందని పొగుడుతున్నారు.

అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపడుతున్నారు. ముఖ్యంగా తారక్ అయితే.. తీరిక లేకుండా గడుపుతున్నారు. సౌత్ టు నార్త్ మంచి బజ్ క్రియట్ చేశారు. ముంబైలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫుల్ వీడియోస్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. అలా ఓ ఇంటర్వ్యూలో భాగంగానే ఆలియా భట్.. చుట్టమల్లె సాంగ్ పాడి ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఆలియా యాక్ట్ చేస్తున్న బాలీవుడ్ మూవీ జిగ్రా.. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానుంది. దీంతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.. ఎన్టీఆర్, ఆలియాతో కలిసి.. దేవర కా జిగ్రా పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం) మూవీతో ఆలియా భ‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో మూవీలో బాగా మెప్పించింది. పలు సన్నివేశాల్లో తన యాక్టింగ్ తో కట్టిపడేసింది అమ్మడు.

Tags:    

Similar News