ఒకేసారి అగ్ర హీరోలతో పోటీకి దిగిన అలియా

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న నటి అలియా భట్.

Update: 2024-08-23 13:30 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న నటి అలియా భట్. ఈ బ్యూటీ గత ఏడాది రణవీర్ సింగ్ కి జోడీగా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమాతో హిందీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తరువాత హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలియా భట్ నటించింది. ఈ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

వీటి తర్వాత ఈ ఏడాదిలో జిగ్రా అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ టైం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్టోబర్ 10న జిగ్రా సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇదే డేట్ కి కోలీవుడ్ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువా మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది.

సౌత్ లో అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పూర్వ జన్మల నేపధ్యంలో హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగువా ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ ని కూడా షేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

దీంతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వేట్టయాన్ సినిమా కూడా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో వేట్టయాన్ పైన ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

ఈ రెండు పెద్ద సినిమాలకి పోటీగా అలియాభట్ జిగ్రా థియేటర్స్ లోకి వస్తోంది. ఈ రెండింటికి ఉన్న హైప్ తో పోల్చుకుంటే జిగ్రా చాలా చిన్న సినిమా. అయిన కూడా కూడా సినిమా స్త్రీ2 తరహాలో సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. ఆగష్టు 15న రిలీజ్ అయిన స్త్రీ2 మూవీ అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేదా సినిమాలతో పోటీ పడుతూ థియేటర్స్ లోకి వచ్చింది. అయిన కూడా ఆ రెండింటిని బీట్ చేస్తూ బాక్సాఫీస్ ముందు సక్సెస్ ని ఈ చిత్రం అందుకుంది. స్త్రీ2 తరహాలోనే జిగార కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News