బిడ్డకు మమ్మీ అయినా తగ్గేదేలే..ఆలియా కిల్లింగ్!
ఒక బిడ్డకు మమ్మీ అయినా కానీ ఆలియా తగ్గేదేలే అంటూ చెలరేగిపోతోంది.
ఒక బిడ్డకు మమ్మీ అయినా కానీ ఆలియా తగ్గేదేలే అంటూ చెలరేగిపోతోంది. ఈ బ్యూటీ ఇటీవల వరుస ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అంతకంతకు వేడి పెంచేస్తోంది. తన కుమారుడు రాహా కోసం ఎంతగానో తపించిపోయే ఆలియా భట్ తన కెరీర్ పైనా అంతే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. భర్త రణబీర్‌తో కలిసి తదుపరి సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రంలో నటించేందుకు ఆలియా ప్రిపేరవుతోంది.
ఇంతలోనే వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. తాజాగా ఆలియా డెనిమ్ లుక్ మతులు చెడగొట్టింది. ఆలియా అలా డీప్ బ్లూ కలర్ డెనిమ్ ఫ్రాక్ ధరించి కిల్లర్ లుక్ తో కట్టి పడేసింది. ఇది భుజాలను కవర్ చేయని స్లీవ్ లెస్ ఫ్రాక్ .. థై సొగసులను ఎలివేట్ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైలర్ గా మారింది.
ఆలియా ఇటీవల సోషల్ మీడియాల్లో తన బ్రాండ్లను విస్త్రతంగా ప్రచారం చేస్తోంది. అలాగే ముంబైలో నిర్మిస్తున్న తన కలల సౌధం అయిన భారీ గృహం పనులు ఎంతవరకూ వచ్చాయో భర్తతో కలిసి పరిశీలిస్తోంది. త్వరలోనే ఈ ఇంటిలోకి అడుగుపెట్టనుంది. ఆసక్తికరంగా ఈ ఇంటిని ఇప్పటికే తన కుమార్తె రాహాకు రణబీర్ కనుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలియా త్వరలో వేదంగ్ రైనా నటించిన `జిగ్రా` చిత్రంలో కనిపించనుంది. కరణ్ జోహార్‌తో కలిసి ఆలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ యొక్క జీ లే జరాలో కూడా అలియా నటించాల్సి ఉంది. ఈ సినిమా ఆగిపోలేదని ఇటీవల ప్రియాంక చోప్రా కన్ఫామ్ చేసింది. తన భర్త, రణబీర్ కపూర్ -విక్కీ కౌశల్‌తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్`లో నటించనుంది. ఇవే కాకుండా YRF స్పై యూనివర్స్‌లో ఒక యాక్షన్ చిత్రంలోను నటించనుంది.