ఫోటో స్టోరి: మైండ్ బ్లాంక్ చేసిన ఆలియా

తాజాగా ఆలియా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఆలియా పాక్షికంగా అందాల‌ను ఎలివేట్ చేసే మెస్సీ ఫ్రాక్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది.

Update: 2023-09-22 03:54 GMT

అందం, ప్ర‌తిభ ఒకే ఒర‌లో ఇమిడితే అది ఆలియాభ‌ట్. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో అంద‌గ‌త్తెలు ఉన్నా కానీ ఆలియాలా మెరిసిపోలేరు. మెస్మ‌రైజ్ చేసేంత ప్ర‌తిభ అంద‌రికీ సాధ్యం కాదు. కెరీర్ ప్రారంభించిన త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన ముద్ర వేసి, క‌థానాయిక‌గా అగ్ర‌తాంబూలం అందుకున్న ఈ బ్యూటీ ప్ర‌ముఖ నిర్మాత మ‌హేష్ భ‌ట్ వార‌సురాలిగా సుప‌రిచితురాలు. అయితే ప‌రిశ్ర‌మ‌లో ఆలియాకు ప్ర‌తిభ ఆధారంగానే అవ‌కాశాలు ద‌క్కాయి.


దీపిక ప‌దుకొనే, క‌త్రిన త‌ర‌హాలోనే కొన్ని స్త్రీ ఆధారిత పాత్ర‌ల‌తోను ఆలియా మెప్పించింది. ఇక ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆలియా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఆలియా పాక్షికంగా అందాల‌ను ఎలివేట్ చేసే మెస్సీ ఫ్రాక్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. దీనికి కాంబినేష‌న్ క్రిస్ట‌లైన్ స్ట్రాపీ డిజైన‌ర్ కోట్ ప‌ర్ఫెక్ట్ యాప్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఆలియా సిజ్లింగ్ లుక్ అద్భుతం అంటూ దీనికి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ స్ట్రైకింగ్ ఫోజ్ కుర్ర‌కారు గుండెల్లోకి సూటిగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

స్త్రీ ఆధారిత పాత్ర‌ల‌పై ...!

అలియా భట్ ప్రస్తుతం తన తాజా థియేట్రికల్ రిలీజ్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. ఒకే ఏడాదిలో వ‌రుస విజ‌యాల‌తో ఆలియా కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తోంది. ఇక ర‌ణ‌బీర్ ని పెళ్లాడి కుమార్తె రాహాకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే ఏడాది పెద్ద-బ్యానర్ ఆహ్వానంతో హాలీవుడ్ లోను ప్ర‌వేశించింది ఈ బ్యూటీ. తాజా ఇంటర్వ్యూలో ఆలియా స్త్రీ ఆధారిత చిత్రాల న‌టి అన్న ట్యాగ్ లైన్ త‌నకు న‌చ్చ‌ద‌ని కూడా చెప్పింది.

నేను ఈ ట్యాగ్‌లను ద్వేషిస్తున్నాను... వాటిని హాస్యాస్పదంగా భావిస్తున్నాను! అని ఆలియా సూటిగా చెప్పింది. నిజానికి హీరోయిజంతో పాటు కథాంశానికి అనుగుణంగా బలమైన ఫీమేల్ లీడ్‌లను చేసాన‌ని ఆలియా తెలిపింది. ఈ భామ‌ న‌టించిన‌ రెండవ చిత్రం హైవే (2014) దీనికి మొదటి ఉదాహరణ. ఇటీవల గంగూబాయి కతియావాడి -డార్లింగ్స్ రెండిటినీ ఇంచుమించు ఒకే కేట‌గిరీలో వర్గీకరించి కొంద‌రు విశ్లేషించారు.

అలియా భట్ సినీప‌రిశ్ర‌మ‌లోని బంధుప్రీతి చర్చపైనా స్పందించింది. నిజానికి న‌ట‌వార‌స‌త్వం రక్షణాత్మకమైన‌దని ఆలియా అంగీకరించింది. ఎందుకంటే తాను ఎప్పుడూ కష్టపడి పనిచేశానని బంధుప్రీతి కొంత‌వ‌ర‌కూ ఆదుకుంటుంద‌ని కూడా ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. కెరీర్ లో ఎదుగుద‌ల కార‌ణాల‌ను ఆలియా రివీల్ చేసింది. కానీ సమయం, వయస్సుతో పాటు త‌లెత్తే కష్టాలు కొన్ని ఉన్నాయని గ్రహించిన‌ట్టు తెలిపింది. హెడ్‌స్టార్ట్‌ను గుర్తించి ఆశించిన స్టార్ డ‌మ్ అందుకునే దిశ‌గా ప్రవేశించడానికి నాకు సులభమైన మార్గం కెరీర్ తొలి నాళ్ల‌లోనే తెలిసింది అని కూడా ఆలియా వెల్ల‌డించింది. ఆలియా ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ లో ఆనందాన్ని ఆస్వాధిస్తోంది. త‌దుప‌రి బ్ర‌హ్మాస్త్ర 2లో న‌టించాల్సి ఉంది.

Tags:    

Similar News