అలియా భట్ బేంచీలు తుడిచే పరిస్థితి ఎందుకొచ్చింది..?
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం 400 మందితో పోటీ పడి మరీ ఆ ఛాన్స్ అందుకుంది అలియా భట్.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రతిభ అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్ర ఇచ్చినా ప్రేక్షకులను మెప్పించే అలియా భట్ మొన్నటిదాకా దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురు ఆ తర్వాత స్టార్ హీరో సతీమణి కానీ ఇప్పుడు ఒక అభినయ తార . 2012 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అలియా భట్ హైవే, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్ సినిమాల్లో నటించి రాణించింది. అయితే తను మహేష్ భట్ కూతురు కాబట్టి అవకాశాలు రాలేదు. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నా కాబట్టే అవకాశం ఇచ్చారని అంటుంది అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం 400 మందితో పోటీ పడి మరీ ఆ ఛాన్స్ అందుకుంది అలియా భట్.
మహేష్ భట్ పేరు వాడుకోకుండా సినిమాల్లోకి రావాలని ఆమె స్టూడియోల చుట్టూ ఒక ఛాన్స్ ప్లీజ్ అంటూ తిరిగిందట. ఇక మొదటి సినిమా కోసమే దాదాపు 16 కేజీల దాకా బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చింది అలియా భట్. కెరీర్ మొదట్లో తాను ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నెపోటిజం గురించి అడిగేవారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే రాణించగలుగుతోందని అనేవారు. అయితే తాము ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే అలా ఎందుకు అంటున్నారో అర్ధమయ్యేది కాదని అలియా ఒక టైం లో చెప్పుకొచ్చారు.
ఇక చిన్ననాటి విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అలియా భట్ ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ స్కూల్ లో చదువుకున్నారని చెప్పారు. రోజూ స్కూల్ కి వెళ్లడం అక్కడ బాత్ రూమ్ లోనే నిద్రపోయే దాన్ని.. ఒకసారి టీచర్ తనని చూసి వారం పాటు క్లాస్ రూం బెంచీలను తుడవమని పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పారు అలియా భట్. అప్పుడు అది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు తలచుకుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక తనకు ఇష్టమైన ఫుడ్ గురించి చెబుతూ చేపలు, రసగుల్లా, ఫ్రెంచ్ ఫ్రైస్, పెరుగన్న, పెసరపప్పు హల్వా ఇష్టంగా తింటానని చెప్పింది. భోజనంలో ఏవి ఉన్నా లేకపోయినా పెరుగు మాత్రం కచ్చితంగా ఉండాలని అంటుంది అలియా భట్. ఇక తనకు పిల్లులు అంటే ఇష్టమని తను పెంచుకునే పిల్లి పేరు ఎడ్వర్డ్ అని చెప్పారు అలియా.
అలియా భట్ కెరీర్ లో తనకు పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఉడ్తా పంజాబ్ నుంచి రాజీ, డియర్ జిందగీ, గల్లీ బాయ్, సడక్ 2 సినిమాల్లో అలియా నటన అందరినీ ఆకట్టుకున్నారు. ఇక సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కిన గంగూబాయి కఠియావాడి సినిమా అయితే అలియా కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ సినిమా లో వేశ్యగా నటించిన అలియా జాతీయ అవార్డు కూడా అందుకుంది.
బాలీవుడ్ సినిమాలతోనే అలరించడం కాదు తెలుగులో RRR లో సీత పాత్రలో అదరగొట్టింది అలియా భట్. ట్రిపుల్ ఆర్ లో అలియా నటించడం ఆ సినిమాకు సెపరేట్ క్రేజ్ తెచ్చింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్రం అంటూ డబ్బింగ్ సినిమాతో కూడా అలరించారు. లాస్ట్ ఇయర్ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమా చేసిన అలియా భట్ హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా కూడా చేశారు. ప్రస్తుతం జిగ్రా అనే సినిమాతో త్వరలో రాబోతుంది. వీటితో పాటుగా మరోసారి సంజయ్ లీలా భన్సాలి సినిమా చేశారు యశ్ రాజ్ ఫిలింస్ చేస్తున స్పై యూనివర్స్ లో కూడా నటిస్తున్నారు అలియా భట్.
హీరోయిన్ గానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి చాటుతుంది అలియా భట్. డార్లింగ్స్ సినిమాతో నిర్మాతగా మారిన అలియా పోచర్ వెబ్ సీరీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసింది. అలియా భట్ కు డైరీ రాసే అలవాటు ఉందట. ఎంత లేట్ అయినా.. అలసటగా ఉన్నా డైరీ రాసే నిద్రపోతుందట. ఇక తనకు ఇష్టమైన హీరోయిన్స్ గా కరీనా, కరిష్మా పేరు చెప్పే అలియా భట్.. హీరోల్లో షారుఖ్ ఖాన్ అని చెప్పారు. తెలుగులో ప్రభాస్ అంటే ఇష్టమని బాహుబలిలో ప్రభాస్ నటన ఎంతో నచ్చిందని అన్నారు అలియా భట్. అవకాశం వస్తే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అంటుంది అలియా భట్.
నటిగా సత్తా చాటుతూ నిర్మాతగా అభిరుచి గల సినిమాలు చేస్తున్న అలియా భట్ పుట్టినరోజు నేడు.. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే అలియా భట్.