భార్యా-భ‌ర్త‌ల ఫైటింగ్ కి హీరోయిన్ పుల్ స్టాప్!

ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ జోడీల‌కు పుట్టిన ముద్దుల పాపాయి తండ్రిలా ఉంటుందా? త‌ల్లిలా ఉంటుందా? అన్న‌ది ఇప్ప‌టికీ తెగ‌ని పంచాయ‌తీ

Update: 2023-11-16 15:30 GMT

ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ జోడీల‌కు పుట్టిన ముద్దుల పాపాయి తండ్రిలా ఉంటుందా? త‌ల్లిలా ఉంటుందా? అన్న‌ది ఇప్ప‌టికీ తెగ‌ని పంచాయ‌తీ. ఈ విష‌యంలో ర‌ణ‌బీర్-అలియా గొడ‌వ పడుతూనే ఉంటారు. ర‌ణ‌బీర్ డాడ్ లా ఉందంటే? అలియా కాదు మ‌మ్మీలా ఉందంటూ ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ సాగుతుంటుంది. మ‌రి ఈ పంచాయ‌తీ తెల్చేది ఎవ‌రు? అంటే క‌రీనా క‌పూర్ అని తెలుస్తోంది.

ఇటీవ‌ల 'కాఫీ విత్ క‌ర‌ణ్' టాక్ షోకి అలియాభ‌ట్..క‌రీనా క‌పూర్ జంట‌గా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. క‌ర‌ణ్ ప్ర‌శ్న‌ల ప‌రంపర‌లో భాగంగా క‌రీనా చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చింది. అలియా పై త‌న‌కున్న అభి మానమంతా మాట‌ల్లో చాటుకుంది. ఈ నేప‌థ్యంలో ర‌ణ‌బీర్-క‌రీనా కుమార్తె రెహా ఎవ‌రి లా ఉంటుంది? అన్న ప్ర‌శ్న క‌రీనా ముందుకెళ్లింది. అందుకు క‌రీనా ఎక్కువ‌గా ఆలోచించ‌కుండా ర‌ణ‌బీర్ లా ఉంటుం ద‌ని...చాలా పోలిక‌లు తండ్రిని పోలి ఉంటాయ‌ని చెప్పింది.

మొత్తానికి ర‌ణ‌బీర్-అలియా క‌య్యానికి ఈ ర‌కంగా క‌రీనా పుల్ స్టాపెట్టింద‌నొచ్చు. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు కుమార్తె కోసం గొడ‌వ‌ప‌డ‌టం ఎంతో ముచ్చ‌ట‌గా అనిపిస్తుందని తెలిపింది. ఇదే టాక్ షోలో అలియా బాలీవుడ్ లో ఎదిగిన వైనం గురించి క‌రీనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. క‌ర‌ణ్ తో కాఫీని షేర్ చేసుకోవ‌డం క‌రీనాకి కొత్తేం కాదు.గ‌తంలో చాలాసార్లు టాక్ షోలో పాల్గొంది.

క‌ర‌ణ్ నుంచి ఆమె కూడా చాలా ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర్కుంది. ఆ స‌మ‌యంలో క‌రీనాకి మ‌ద్ద‌తుగా అమీర్ ఖాన్ నిలిచారు. ఇక క‌రీనా సినిమాల సంగ‌తి చూస్తే కాఫ్ స్టోరీ 'సింగం ఎగైన్' లో న‌టిస్తోంది. ఇక ర‌ణ‌బీర్ క‌పూర్ యానిమ‌ల్ తో ప్రేక్షకుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 1 న విడుదలవుతుంది. అలియా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా ఉంది.

Tags:    

Similar News