సూపర్ స్టార్ ఫర్ ఏ రీజన్.. మహేష్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి ఫ్యాన్స్ అంతా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది.

Update: 2023-08-09 08:41 GMT

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఒక క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా మరోసారి కన్ఫర్మ్ చేశారు మూవీ యూనిట్. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి ఫ్యాన్స్ అంతా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. మహేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

1975 ఆగష్టు 9న మహేష్ మద్రాసులో జన్మించారు. మహేష్ పుట్టిన నాటికే సూపర్ స్టార్ కృష్ణ 100 సినిమాలకు పైగా చేశారు. ఇక మహేష్ ఆరేళ్ల వయసులోనే కెమెరా ముందు నటించాడు. అన్న రమేష్ తో కలిసి నీడ సినిమాలో నటించారు మహేష్. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ కి తెలియకుండా ఆయన్ను నటింపచేశారు. అలా మహేష్ తెరంగేట్రం ఆయన ప్రమేయం లేకుండానే అయిపోయింది.

నీడ తర్వాత కృష్ణ నటించిన పోరాటం సినిమాలో కూడా మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. సమ్మర్ హాలీడేస్ రాగానే షూటింగ్స్ లో పాల్గొనే మహేష్ అలా సమ్మర్ సెలవుల్లోనే గూఢచారి 117, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బజార్ రౌడీ సినిమాలు చేశాడు. అయితే ఆ టైం లో సినిమాలకు ఎట్రాక్ట్ అవుతున్నాడని గమనించిన కృష్ణ సినిమాల వల్ల మహేష్ చదువు పాడైపోతుందని భావించి సినిమాలు వద్దని చదువుకోవాలని చెప్పారట. అయినా సరే పదవ తరగతిలో మహేష్ కి సరైన మార్కులు రాకపోవడమో లయోలా కాలేజ్ లో ఇంటర్ అడ్మిషన్ దొరకలేదు. అయితే ఇంటర్ లో మంచి మార్కుల కోసం కష్టపడి డిగ్రీలో లయోలా లో బీకాం సీటు సాధించారు మహేష్. ఆ టైం లోనే మళ్లీ సినిమాలపై ఆసక్తి చూపించగా రాజకుమారుడుతో మహేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ.

మహేష్ బాబు ఇప్పటివరకు ఒక రీమేక్ సినిమాను కూడా చేయలేదు. దాదాపు టాలీవుడ్ లో ఇలా రీమేక్ చేయని హీరో ఆయన ఒక్కరే అని చెప్పొచ్చు. ఇక బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా సరే తెలుగులో సినిమాలు చేస్తానని ఇక్కడే చేయాల్సినవి చాలా ఉందని అంటుంటారు. ఇక హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన టేస్ట్ చూపిస్తున్నారు మహేష్. అడివి శేష్ తో మేజర్ సినిమా నిర్మించి హిట్ అందుకున్నారు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ 350కి పైగా సినిమాలు చేయగా ఆయన బెస్ట్ యాక్టర్ గా ఒక్క నంది అవార్డ్ కూడా అందుకోలేదు. కానీ మహేష్ మాత్రం నటించిన 27 సినిమాల్లోనే 8 నందిలను అందుకున్నారు.

మహేష్ నటించిన రాజకుమారుడు, నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ సినిమాలకు నంది అవార్డ్ అందుకున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో రెండు మాత్రమే జూబ్లీ ఆడాయి. కానీ మహేష్ కెరీర్ లో నాలుగు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. మహేష్ నటించిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ నాలుగు సినిమాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం.ఎం లో సిల్వర్ జూబ్లీ జరుపుకుని మహేష్ ఖాతాలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్ క్రియేట్ చేశాయి.

మహేష్ కి ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. మహేష్ ఇష్టంగా ఫస్ట్ టైం నోకియా క్లాసికల్ మోడల్ కీ ప్యాడ్ మొబైల్ కొన్నారు. మహేష్ తరచు ఫోన్లు మారుస్తూనే ఉంటారు. మహేష్ తండ్రి కృష్ణతో సెల్ఫీ దిగేందుకు చాలా ఇష్టం చూపిస్తారు. సమాజ సేవలో కూడా మహేష్ తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. కృష్ణ సొంతూరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. తెలంగాణాలో సిద్ధాపురం గ్రామాన్ని కూడా మహేష్ దత్తత తీసుకున్నారు. అంతేకాదు చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ కూడా చేయిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు మహేష్.

Tags:    

Similar News