.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఫుల్ జోష్ లో అల్లరి నరేష్.. మరో సినిమా..

భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకుంది.

Update: 2024-06-30 18:32 GMT

టాలీవుడ్ లో హీరో అల్లరి నరేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మొదట ఎక్కువగా ఫన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత రూట్ మార్చి విభిన్నమైన చిత్రాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఆ ఒక్కటీ అడక్కు మూవీతో వచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకుంది.

ప్రస్తుతం సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో బచ్చలమల్లి సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీ నుంచి మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బచ్చలమల్లి కోసం నరేష్ వేరే లెవల్ లో మేకోవర్ చేసుకున్నారు. ఊర మాస్ లుక్ లో అదరగొట్టేశారు. అయితే నేడు బర్త్ డే సందర్భంగా ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

'మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు' అంటూ సినిమాను ప్రకటించిన సితార సంస్థ.. కాన్సెప్ట్ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేసింది. సైన్ లాంగ్వేజ్ తో ఇంట్రెస్టింగ్ సింబల్స్ తో పోస్టర్ వినూత్నంగా ఉంది. దీంతో ఆ సంకేతాలను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు నెటిజన్లు. పోస్టర్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోందని చెబుతున్నారు. పోస్టర్ తోనే విభిన్న కాన్సెప్ట్‌ తో మూవీ తెరకెక్కునుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.

Read more!

ఈ సినిమాకు మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా చిత్రంతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఆయన.. ఈ సినిమాను కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను మరికొద్ది రోజుల్లో అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించనున్నారు.

అయితే కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా.. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. థియేటర్లలో ఆడియన్స్ ను ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుందని అంచనా వేస్తున్నారు. మూవీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News