అల్లరోడు రైటర్ గా మారుతున్నాడట.. దేనికోసం అంటే..!

అయితే తరువాత కాలంలో ఆశించిన స్థాయిలో కామెడీ కథలతో నరేష్ హిట్స్ అందుకోలేకపోయారు.

Update: 2024-04-23 05:29 GMT

కామెడీ హీరోగా అల్లరి సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ తో మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు అల్లరి నరేష్. అతనికి నటుడిగా గుర్తింపుని తీసుకొచ్చినవి, సక్సెస్ ఇచ్చినవి కామెడీ చిత్రాలే అని చెప్పాలి. అయితే తరువాత కాలంలో ఆశించిన స్థాయిలో కామెడీ కథలతో నరేష్ హిట్స్ అందుకోలేకపోయారు.

దీంతో రూట్ మార్చి సీరియస్ రోల్స్ ట్రై చేశాడు. మహర్షి మూవీలో కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. నాంది అనే సినిమాలో పోలీసుల బంధితుడిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించి సక్సెస్ అందుకున్నాడు. తరువాత ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం అనే సోషల్ ఎక్స్ పర్మెంట్ మూవీ చేసాడు. సినిమాకి బాగుందనే టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. నెక్స్ట్ ఉగ్రం అనే మరో ప్రయోగాత్మకమైన సినిమాలో సీరియస్ హీరోగా కనిపించాడు.

మరల తనకి కలిసొచ్చే కామెడీనే నమ్ముకొని ఆ ఒక్కటి అడక్కు అంటూ అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక తన తండ్రి సూపర్ హిట్ మూవీస్ లలో ఆ ఒక్కటి అడక్కు ఒకటి. రాజేంద్రప్రసాద్ కెరియర్ బెస్ట్ సినిమాలలో ఒకటిగా ఇది కచ్చితంగా ఉంటుంది. అదే టైటిల్ తో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గానే ఆ ఒక్కటి అడక్కు సినిమాని అల్లరి నరేష్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. దీనికి పాజిటివ్ టాక్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నరేష్ ఆసక్తికర విషయాలు మాట్లాడారు. నరేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే సుడిగాడు (2012) అనే చెప్పాలి. దానికి సీక్వెల్ చేసే ప్లానింగ్ జరుగుతోందని అల్లరి నరేష్ రివీల్ చేశాడు. సుడిగాడు 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

వచ్చే ఏడాది ఆ సినిమా ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేసేసాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఆ సినిమా కోసం నరేష్ రైటర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ కు ఎలాంటి కామెడీ కావాలో అతనికి బాగా తెలుసు. అందుకే తనే రంగంలోకి దిగి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇక సుడిగాడు సినిమాను అప్పట్లో భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశాడు.

మరి ఇప్పుడు కూడా ఆయనే డైరెక్ట్ చేస్తారా.. లేదంటే మరికరిని సెలెక్ట్ చేస్తారా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సీక్వెల్ తో హిట్ పడితే కచ్చితంగా నరేష్ ఇమేజ్, మార్కెట్ అమాంతం పెరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సుడిగాడు ఆ రోజుల్లో ఏకంగా 21 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇక సుడిగాడు 2తో మళ్ళీ నరేష్ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

Tags:    

Similar News