ఆల్ టైమ్ సంక్రాంతి బాక్సాఫీస్.. నెంబర్ వన్ ఛాన్స్
హిందీ ఆడియన్స్ సినిమాకి చూపిస్తున్న ఆదరణకు రోజురోజుకు అక్కడ థియేటర్లు పెంచుకుంటూ పోతున్నారు.
టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 115పైగా కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక నార్త్ లో అయితే హనుమాన్ మ్యానియా మాములుగా లేదు.
హిందీ ఆడియన్స్ సినిమాకి చూపిస్తున్న ఆదరణకు రోజురోజుకు అక్కడ థియేటర్లు పెంచుకుంటూ పోతున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం హనుమాన్‌కు అక్కడ మరింత ప్లస్ అయ్యింది. మరో వారం రోజుల పాటూ హనుమాన్ హంగామా ఇదే రేంజ్ లో కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్ అయితే నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్ టాలీవుడ్ ఆల్ టైం సంక్రాంతి రికార్డ్ గ్రాసర్ గా దూసుకుపోతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో ఇప్పటివరకు అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో వరల్డ్ వైడ్ గా 260 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని సంక్రాంతి సీజన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసి ఇతర భాషల సాయంతో సంక్రాంతికి హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచే దిశగా 'హనుమాన్' మూవీ పరుగులు పెడుతోంది. హనుమాన్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి ఫస్ట్ వీకెండ్ లో 140 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక సెకండ్ వీక్ లోనూ భారీ కలెక్షన్స్ వస్తుండడంతో కచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్ లో సుమారు 275 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే హనుమాన్ మూవీ 'అలవైకుంఠపురంలో' రికార్డు బద్దలు కొట్టి టాలీవుడ్ లో సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక మొదటి వారంలో హనుమాన్ ఆంధ్ర, నైజాం ఏరియాలు కలిపి 64 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.(GST తో కలిపి) ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లకే అమ్ముడయ్యాయి. దాని ప్రకారం హనుమాన్ మొదటి వారంలోనే 250 శాతం కంటే ఎక్కువ రికవరీ చేసిందని చెప్పొచ్చు.