ఎట్టకేలకు బిట్టు లుక్‌కి వచ్చిన పుష్పరాజ్‌

సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా ఆ జుట్టు, గడ్డం కంటిన్యూ చేసి ఐకాన్ స్టార్‌గా నిలిచాడు.

Update: 2025-01-04 14:23 GMT

అల్లు అర్జున్‌ గత నాలుగు ఏళ్లుగా పుష్ప సినిమా కోసం మాస్ లుక్‌లోనే కనిపించాడు. సినిమా కోసం పెంచిన గడ్డం, జుట్టు అలాగే కంటిన్యూ చేశాడు. సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా ఆ జుట్టు, గడ్డం కంటిన్యూ చేసి ఐకాన్ స్టార్‌గా నిలిచాడు. పుష్ప పార్ట్‌ 1 విడుదలైన తర్వాత పార్ట్‌ 2 షూటింగ్‌ ప్రారంభంకు ఏడాదికి పైగా సమయం పట్టింది. ఆ సమయంలోనూ అల్లు అర్జున్‌ లుక్ మార్చలేదు. అదే లుక్‌లో కనిపించాడు. ముఖ్యంగా ఆయన గడ్డం, పొడవైన జుట్టు లుక్‌లోనే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గడచిన నాలుగు ఏళ్లుగా మెయింటెన్ చేస్తున్న ఆ లుక్‌కి బ్రేక్ ఇచ్చాడు.

ఎట్టకేలకు పుష్ప రాజ్ లుక్‌ నుంచి అల్లు అర్జున్‌ బయటకు వచ్చాడు. అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించిన బిట్టు లుక్‌లోకి ప్రస్తుతం అల్లు అర్జున్‌ వచ్చాడు. తన తదుపరి సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పుష్ప రాజ్‌తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పట్లో ఆ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు. పైగా కథ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ఆ సినిమా ప్రారంభానికి ముందే ఎందుకు బన్నీ లుక్ మార్చాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్‌ నేడు సంధ్య థియేటర్‌ కేసులో బెయిల్‌ సొంత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు హాజరు అయ్యారు. ఆ సమయంలో సింపుల్‌ లుక్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో హంగామా లేకుండా వెళ్లాడని తెలుస్తోంది. ఆయన పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ సమయంలో వాడిన ఔట్‌ ఫిట్‌ విషయంలో విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు కోర్టుకు ఆయన సాదా సీదాగా వెళ్లారు అంటూ వార్తలు వస్తున్నాయి. బన్నీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లాలి అనుకున్నా కోర్టు కేసు కారణంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

పుష్ప 2 సినిమా విషయానికి వస్తే బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్‌ను బ్రేక్‌ చేయబోతుంది. ఇక లాంగ్‌ రన్‌లో ఈ సినిమాకు రూ.2000 కోట్ల వసూళ్లు సాధ్యమే అంటూ బాక్సాఫీస్ వారు బలంగా చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే సినిమా కోసం రూ.2000 కోట్ల పోస్టర్‌ను రెడీ చేసి ఉంచారని తెలుస్తోంది. రెండు వారాల తర్వాత ఆ పోస్టర్‌ను వదులుతారు అంటున్నారు. సినిమా కచ్చితంగా ఆ మార్క్‌ను దాటుతుందని వారు బలంగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News