ఇది అర్థం చేసుకుంటే సమస్యే ఉండదు: అల్లు అర్జున్

అతను వేసే కాస్ట్యూమ్స్ ని యూత్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

Update: 2024-11-24 07:21 GMT

తెలుగులో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరనే సంగతి అందరికి తెలిసిందే. పుష్ప మూవీ తర్వాత బన్నీకి దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పాట్నా వెళ్లిన ఆయనకి అపూర్వ స్వాగతం లభించింది. దీనిని బట్టి బన్నీకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే స్టైలిష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ ని చూస్తారు.

అతను వేసే కాస్ట్యూమ్స్ ని యూత్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అతని ఐడియాలజీని కూడా అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇదిలా ఉంటే బన్నీని ఇప్పటి వరకు ఒక హీరోగా, స్టార్ గా చూసి అభిమానించేవారు అతని నమ్మే ఫిలాసఫీని కూడా ఫాలో అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రీసెంట్ ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ టాక్ షోలో అల్లు అర్జున్ పాల్గొన్నారు.

ఆయనకి సంబంధించి ఎపిసోడ్ 4 పార్ట్ 2లో బాలయ్యతో బన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యారు. అలాగే అతను నమ్మే ఫిలాసఫీ ఏంటనేది కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత బ్లడ్ రిలేషన్ అయిన కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయని అన్నారు. నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించే మా నాన్న, నేను ఒకే ఇంట్లో ఉంటాం.

ఆయన చెప్పేది నేను ఫాలో అవుతాను. అయిన కూడా మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను ఆ అంశాన్ని ఎలా చూస్తానంటే, మన ఇద్దరికి కేవలం ఈ సబ్జెక్టులో పడదు. అది ఆ సబ్జెక్ట్ వరకే ఉంటుంది. నీకు నాకు మధ్య కాదు. అందరూ రిలేషన్ షిప్ లో చేసే తప్పు ఇదే… సపోజ్ నేను ఎవరైనా చెప్పే విషయానికి నో చెబితే, అదేదో వారికి నో చెప్పినట్లు ఫీల్ అవుతారు.

నేను నీకు చెప్పలేదు. ఆ సబ్జెక్ట్ కి మాత్రమే నో చెప్పాను. ఇది అర్ధం చేసుకుంటే 99% రిలేషన్స్ లో ఎలాంటి సమస్యలు రావని బన్నీ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ చెప్పిన ఈ లైఫ్ ఫిలాసఫీ ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకోవచ్చనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం దీనిని మరో రకంగా అర్ధం చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా బన్నీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News