ల‌వ్ ఫెయిలై సిగరెట్ పీకలతో కాల్చుకుని మద్యానికి బానిసైన న‌టుడు!

ఇదంతా క‌పూర్ సామ్రాజ్య అధినాయ‌కుడు రాజ్ కపూర్ గురించిన స్టోరి. లెజెండరీ ఫిల్మ్ మేకర్, నటుడు కం నిర్మాత రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను ఇటీవలే ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

Update: 2024-12-26 07:30 GMT

భార‌త‌దేశంలో లెజెండ‌రీ న‌టుడిగా అత‌డు సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న‌ న‌టించిన ఎన్నో క్లాసిక్స్ ని శ‌త‌దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శిస్తూ దేశ ప్ర‌ధాని మోదీకి సైతం ఆహ్వానం పంపారు. అత‌డి త‌ర్వాత రెండు త‌రాల‌ వార‌సులు ప‌రిశ్ర‌మను ఏల్తున్నారు. కుమారుడు పెద్ద హీరోగా స‌త్తా చాట‌గా, మ‌న‌వ‌డు ఇప్పుడు అగ్ర హీరోగా ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్నాడు.

అయితే అంత పెద్ద లెజెండ్ ప్రేమలో విఫ‌ల‌మై బ‌కెట్ల‌ కొద్దీ క‌న్నీరు కార్చాడు. ప్రేయ‌సి కోసం త‌న భార్య ముందు బాత్రూమ్ ట‌బ్ లో ప‌డి ఏడ్చాడు. అంతేకాదు.. త‌న ప్రేమికురాలు వేరొక‌రిని అక‌స్మాత్తుగా పెళ్లాడేయ‌డంతో అది త‌ట్టుకోలేక మ‌ద్యానికి బానిస‌య్యాడు. సిగ‌రెట్ పీక‌ల‌తో త‌న‌ను తాను కాల్చుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే ఇంత ఘోరానికి పాల్ప‌డిన లెజెండ‌రీ న‌టుడు ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఇదంతా క‌పూర్ సామ్రాజ్య అధినాయ‌కుడు రాజ్ కపూర్ గురించిన స్టోరి. లెజెండరీ ఫిల్మ్ మేకర్, నటుడు కం నిర్మాత రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను ఇటీవలే ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. హిందీ సినిమా గొప్ప షోమ్యాన్ వార‌సులంతా ఈ వేడుక‌లో సంద‌డి చేసారు. అయితే అంత పెద్ద లెజెండ్ జీవితం ఎప్పుడూ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మే. రాజ్ క‌పూర్ అప్ప‌టికే పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్నా కానీ, స‌హ‌న‌టి న‌ర్గీస్ ద‌త్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు. రాజ్ కపూర్ - నర్గీస్ ద‌త్ జంట 1955 చిత్రం `శ్రీ 420` సెట్స్‌లో శృం*గార సంబంధాన్ని ప్రారంభించారు. కపూర్ అప్పటికే కృష్ణ రాజ్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. అప్ప‌టికి నర్గీస్ వయస్సు 16 సం.లు. వారి ప్రేమ సుమారు 7 సంవత్సరాలు కొనసాగింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్న‌ రాజ్ కపూర్ నుండి న‌ర్గీస్ అక‌స్మాత్తుగా విడిపోయారు. ఈ బంధం వీగిపోవడానికి నర్గీస్ సోదరుడు కూడా ఒక కారణం.

నర్గీస్ అప్ప‌టికే బాలీవుడ్ ప్ర‌ముఖుడైన‌ సునీల్ దత్‌తో ప్రేమలో పడి అతడిని పెళ్లాడారని మధు జైన్ రాసిన ``ది కపూర్: ది ఫస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియన్ సినిమా`` పుస్త‌కంలో ప్ర‌స్థావించారు. నర్గీస్ పెళ్లి తర్వాత రాజ్ కపూర్ గుండె పగిలిపోయింది. తాను మోసపోయానని భావించి మద్యాన్ని ఆశ్రయించాడు. సిగరెట్ పీకలతో కాల్చుకునేందుకు కూడా ప్రయత్నించాడని ఈ పుస్త‌కంలో రాసారు. న‌ర్గీస్ పెళ్లి తర్వాత త‌న భ‌ర్త రాజ్ క‌పూర్ ప్రతిరోజూ రాత్రి తాగి ఇంటికి వ‌చ్చేవాడ‌ని అత‌డి భార్య కృష్ణా క‌పూర్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. నర్గీస్‌ కోసం ఏడుస్తూనే అతడు బాత్‌టబ్‌లో కుప్పకూలాడని కూడా ఆమె వెల్లడించారు. రాజ్ కపూర్ త‌న ప్రియురాలి కోసం ఏడ్వ‌డం అనేది పెద్ద క్రైసిస్ గా ఆమె చెప్పుకొచ్చారు.

రాజ్ క‌పూర్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చట్టబద్ధంగా అత‌డిని వివాహం చేసుకునే ఛాన్సుందో లేదో తెలుసుకునేందుకు న‌ర్గీస్ ప్ర‌య‌త్నించారు. అప్పటి హోం మంత్రి మొరార్జీ దేశాయ్ సహాయం కూడా న‌ర్గీస్ కోరార‌ని బాలీవుడ్ షాదీ డాట్ కాం త‌న క‌థ‌నంలో వెల్ల‌డించింది. ఇద్దరూ ఒక్కటయ్యే అవకాశం లేకపోలేదు కానీ ఆ తర్వాత విడిపోయారు.

తన ఆత్మకథ `ఖుల్లం ఖుల్లా`లో రాజ్ క‌పూర్ కుమారుడు రిషి కపూర్ తన తండ్రికి నర్గీస్‌తో ఉన్న సంబంధాన్ని ధృవీకరించాడు. న‌ర్గీస్ చాలా డైలమాలో ఉండి చివ‌రికి హిందీ నిర్మాత సునీల్ ద‌త్ ని పెళ్లాడింది. సునీల్ -నర్గీస్ జంట‌కు సంజయ్ దత్, నమ్రత దత్, ప్రియా దత్ జ‌న్మించారు. సంజ‌య్ ద‌త్ బాలీవుడ్ అగ్ర హీరోగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News