పుష్ప 2: ఇంకొన్ని సీన్స్?

20 నిమిషాల ఫుటేజ్ ను మేకర్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

Update: 2024-12-26 07:30 GMT

పుష్ప 2: ది రూల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా.. అసలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్ లో అయితే నెవ్వర్ బిఫోర్ అనేలా అదరగొడుతోంది. వేరే లెవెల్ కలెక్షన్స్ సాధిస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచిన పుష్ప-2.. ఇప్పటివరకు నార్త్ లో రూ.710 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. త్వరలో రూ.800 కోట్ల మార్క్ టచ్ చేయనుందనే అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 21 రోజుల్లో పుష్ప-2 రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

అయితే క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు పండ‌గ‌ సీజన్ కావడంతో.. పుష్ప-2 ఇంకా జోరుగా కొనసాగించే అవకాశం కచ్చితంగా ఉంది. అదే సమయంలో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమాకు మరింత ఫుటేజ్ ను యాడ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

20 నిమిషాల ఫుటేజ్ ను మేకర్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. అతి త్వరలో యాడెడ్ సీన్స్ కు సంబంధించిన విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి. మరికొద్ది రోజుల్లో పుష్ప-2 కొత్త వెర్షన్ థియేటర్లలోకి రానుందట.

అయితే వాస్తవానికి.. పుష్ప-2 మూడు గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి ఎక్కువే అయినా.. మూవీ బాగుండడంతో ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. మరో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తే రన్ టైమ్ ఏకంగా 3 గంటల 40 నిమిషాలకు చేరనుంది.

అదే సమయంలో కొత్త సీన్స్ యాడ్ చేశాక.. ఆడియన్స్, అభిమానులు రిపీట్ మోడ్ లో థియేటర్లకు వస్తారని మేకర్స్ భావిస్తున్నారు. అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఓటీటీ రిలీజ్ కు టైమ్ ఉంది కనుక.. కొత్త సీన్స్ యాడ్ చేస్తే మళ్లీ సినిమా చూసేందుకు మొగ్గు చూపిస్తారు. దాని ద్వారా వసూళ్లు భారీగా వస్తాయి. మరి కొత్త వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News