50 రోజుల పుష్ప 2.. ఎన్ని సెంటర్లు..?

పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కాగా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈమధ్య సినిమాలు వారం రెండు వారాలు మాత్రమే థియేట్రికల్ రన్ చూస్తున్నారు.

Update: 2025-01-23 09:26 GMT

సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేసిన పుష్ప ది రైజ్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా పార్ట్ 2 కోసం దాదాపు 3 ఏళ్లు టైం తీసుకుమ్మారు. 2024 డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పుష్ప 2 రిలీజైన మొదటి రోజు నుంచి కూడా యునానిమస్ హిట్ టాక్ తో 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. నార్త్ లో పుష్ప రాజ్ మేనియా చూసి బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అయ్యేలా చేసింది ఈ సినిమా.

పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కాగా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈమధ్య సినిమాలు వారం రెండు వారాలు మాత్రమే థియేట్రికల్ రన్ చూస్తున్నారు. కేవలం స్టార్ సినిమాలు తెచ్చే వందల కోట్ల కలెక్షన్స్ గురించే మాట్లాడుతున్నారు కానీ 50 రోజులు, 100 రోజుల గురించి మర్చిపోయారు. ఈమధ్య వచ్చిన ఏ సినిమా కూడా కనీసం 50 రోజులు ఆడింది లేదు.

పుష్ప 2 మాత్రం డైరెక్ట్ గా, షిఫ్టింగ్ లో తెలుగు రెండు రాష్ట్రాలు, నార్త్ సైడ్ కలిపి 300 ప్లస్ థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో కాకుండా మిగతా ఏరియాల్లో ఇంకా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. పొంగల్ కూడా కలిసి రావడం పోటీగా హిందీ సినిమాలేవి లేకపోవడం వల్ల పుష్ప 2 కి కలిసి వచ్చింది.

పుష్ప 2 హంగామా దాదాపు ముగిసినట్టే. ఇక సినిమా చివర్లో పుష్ప 3 రాంపేజ్ అని వేశాడు సుకుమార్. ఐతే ఆ పార్ట్ మాత్రం ఇప్పుడప్పుడే కుదిరేలా లేదని తెలుస్తుంది. పుష్ప 3 కన్నా ముందు సుకుమార్, అల్లు అర్జున్ కనీసం రెండు సినిమాలైనా చేయాలని అనుకుంటున్నారు. అవి పూర్తయ్యాక 2030 లో పుష్ప 3 ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. సో ఐదేళ్ల తర్వాతే పుష్ప రాజ్ కొనసాగింపు కథ చూడబోతున్నాం. ఐతే పుష్ప 3 కి సంబందించిన కొంత రష్ కూడా ఉండగా సినిమా మూడో భాగం చూడాలని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Tags:    

Similar News