పుష్ప 2.. అల్లు అర్జున్ స్ట్రాంగ్ ప్లాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Update: 2024-10-20 13:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఐదు ఇండియన్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ‘పుష్ప’ మూవీ తెలుగులో కంటే హిందీలో పెద్ద హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ పైన నార్త్ ఇండియాలో భారీ హైప్ నెలకొని ఉంది. ఈ మూవీ థీయాట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

‘పుష్ప 2’ రిలీజ్ కి గట్టిగా చూసుకుంటే రెండు నెలల సమయం కూడా లేదు. చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ పైన పూర్తిగా ఫోకస్ చేయనుంది. సాంగ్స్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళికి ‘పుష్ప 2’ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సారి పబ్లిసిటీ కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేస్టున్నారంట. సౌత్ సినిమాలని హిందీలో రిలీజ్ చేసే సమయంలో ప్రమోషన్స్ కోసం మేగ్జిమమ్ ముంబై మాత్రమే మన హీరోలు వెళ్తున్నారు.

అయితే ‘పుష్ప 2’ ట్రైలర్ కూడా ముంబైలో రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ‘పుష్ప’ సినిమాకి మెజారిటీ ఆదరణ నార్త్ ఇండియా లో వచ్చింది. ముఖ్యంగా పంజాబ్, యూపీ, బీహార్, ఎంపీ లాంటి రాష్ట్రాలలో ఎక్కువ ప్రేక్షకాదరణ లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్స్ కోసం ఆ రాష్ట్రాలలో మెయిన్ సిటీస్ లలో పర్యటించాలని భావిస్తున్నారంట.

అక్కడి ఆడియన్స్ దగ్గరకి నేరుగా వెళ్లి కలవడం ద్వారా మరింతగా సినిమాని చేరువ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మేకర్స్ కూడా దీనికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమోషనల్ క్యాంపైన్స్ ఎప్పటి నుంచి మొదలు పెడతారనేది దీపావళి తర్వాత క్లారిటీ రావొచ్చని అనుకుంటున్నారు.

ఏది ఏమైనా భారీ అంచనాల మధ్యలో రాబోతున్న ‘పుష్ప 2’ ఏ రేంజ్ లో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఇమేజ్ కి కూడా ఈ సినిమా చాలా పెద్ద పరీక్ష. ఈ మూవీ సాధించే కలెక్షన్స్ బట్టి అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ ఎంతనేది కూడా డిసైడ్ అవుతుంది.

Tags:    

Similar News