కమర్షియల్ సినిమా.. చెప్పి మరీ పిచ్చెక్కించిన బన్నీ!

చెప్పినట్లుగానే 'పుష్ప 2' లాంటి కమర్షియల్ చిత్రాన్ని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ లో కూర్చోబెట్టాడు అని అంటున్నారు.

Update: 2024-12-07 18:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప 2" సినిమాతో బాక్సాఫీస్ వద్ద జాతర మాస్ చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ.449 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ట్రెండ్ చూస్తుంటే తక్కువ రోజుల్లో 1000 కోట్ల మైల్ స్టోన్ క్లబ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి క్రిటిక్స్ నుంచి ఈ సీక్వెల్ కు యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు ఏమీ రాలేదు. అయినా సరే పుష్పరాజ్ వసూళ్ల వేటలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బన్నీ గతంలో రివ్యూ రైటర్స్, కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమాకి మిక్స్డ్ రివ్యూలు రావడంపై అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. కమర్షియల్ సినిమాల గురించి విశ్లేషించారు. "ఆల్మోస్ట్ రివ్యూ రైటర్స్ ఎవరికీ కమర్షియల్ సినిమా మీద రెస్పెక్ట్ లేదు. ఒక సింగిల్ జోనర్ సినిమా చేయడం చాలా చాలా ఈజీ. ఒక మల్టీ జోనర్ సినిమా చేస్తే, ఇది లేదు అది లేదు అంటాం. కమర్షియల్ సినిమా అంటే డ్యాన్స్, పాటలు ఉండాలి.. అవి ఉంటే అది మ్యూజికల్ జోనర్. ఫైట్స్ ఉంటే అది యాక్షన్ జోనర్. లవ్ ఉంటే అదో రొమాంటిక్ జోనర్. ట్విస్టులు ఉంటే థ్రిల్లర్ జోనర్. సెంటిమెంట్ ఉంటే డ్రామా జోనర్. వరల్డ్ వైడ్ గా ఇన్ని జోనర్స్ కలిసిన ఒక సినిమా ఏదైనా చెప్పమనండి?"

''టైటానిక్ లాంటి ఇంగ్లిష్ సినిమా తీసుకుంటే లవ్, డ్రామా వంటి ఒకటీ లేదా రెండు జోనర్స్ కలిసి ఉంటాయి. అదే ఒక తెలుగు సినిమా లేదా సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ ని తీసుకుంటే, అది ఒరిజినాలిటీతో కూడిన మల్టీ జోనర్ ఫిలిం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని యునిక్ నెస్ మన సినిమాల్లో ఉంటుంది. కానీ మన యునిక్ నెస్ ని మనం ఓన్ చేసుకోవడం వల్ల వచ్చిన దరిద్రమే ఇది. కమర్షియల్ సినిమాల్లో ఉండే మరో యూనిక్ నెస్ ఏంటంటే.. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ సినిమాలోనూ ఇంటర్వెల్ అనేది ఉండదు"

"ఎన్ని బుక్స్ ఉన్నా, యాక్ట్స్ ఉన్నా, ఎంతమంది స్క్రీన్ ప్లే రైటర్స్ ఉన్నా మనకి అప్లై కాదు. రీజన్ ఏంటంటే ఇంటర్వెల్ పాయింట్ దగ్గర మనం సీట్లో నుంచి లేచి, మళ్ళీ వచ్చి కూర్చొని సినిమా చూస్తాం. ఇది చాలా యునిక్ పాయింట్. ఫారినర్స్ ఇండియాలో సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ వస్తే.. ఏంటి మధ్యలో సడన్ గా సినిమా ఆపేసారు? అనుకుంటారు. అది మన కల్చర్.. మన యునిక్ నెస్. మనం దాన్ని ఓన్ చేసుకోకుండా, ఎవడో తెల్లోడిలా తీస్తే గొప్ప సినిమా.. ఒక జోనర్ లో తీస్తే గొప్ప సినిమా. ఫొటోగ్రఫీ బాగుంటే గొప్ప సినిమా అంటుంటారు. కానీ మన విషయాన్ని మనం గొప్పగా అందంగా చెప్పుకుంటేనే అది గొప్ప సినిమా అవుతుంది"

"ఇవాళ ప్రపంచమంతా, భారతదేశం మొత్తం కలిసి 'బాహుబలి'ని గొప్ప సినిమా అన్నారు. ఎందుకంటే అది పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా అన్నీ కలిసిన మల్టీ జోనర్ ఫిల్మ్. అది మన ఒరిజినాలిటీ.. మన ఇండియన్ మెంటాలిటీ. మనకి ఒక వంటకం ఇస్తే సరిపోదు.. మనకి స్వీట్, హాట్, బిర్యానీ, డ్రింక్ అన్నీ కావాలి. మనం సినిమా విషయంలోనూ అలానే ఆలోచిస్తాం. అదే మన యునిక్ నెస్. దయచేసి మన కమర్షియల్ సినిమాని ఓన్ చేసుకొని, అర్థం చేసుకొని మల్టీ జోనర్ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటే, మనం వరల్డ్ వైడ్ గా రీచ్ అవుతాం'' అని బన్నీ అన్నారు.

అలానే 'అల వైకుంఠపురములో' టైంలోనూ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమా గురించి మాట్లాడారు. "కమర్షియల్ సినిమాల్లోనే నేను ఆ రిఫైన్మెంట్ తీసుకొస్తా.. నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా.. కమర్షియల్ సినిమాతోనే పిచ్చెక్కిపోయేలా చేస్తా.. మంచి యాక్టర్ అని కాదు.. స్టార్ పెరఫార్మర్ అనిపించుకుంటా" అని బన్నీ వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, నవదీప్ క్లాప్స్ కొట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కమర్షియల్ సినిమాపై మొదటి నుంచే అల్లు అర్జున్ కి ఓ క్లారిటీ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చెప్పినట్లుగానే 'పుష్ప 2' లాంటి కమర్షియల్ చిత్రాన్ని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ లో కూర్చోబెట్టాడు అని అంటున్నారు. 'పుష్ప 1' సినిమాతో నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కమర్షియల్ మూవీతోనే ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు బన్నీ 'అన్ స్టాపబుల్' టాక్ షోలో చెప్పారు. ఇప్పుడు చెప్పి మరీ అదే కమర్షియల్ సినిమాతో పిచ్చెక్కిపోయేలా చేయడం విశేషం.

Tags:    

Similar News