హిట్ మిషన్ తో అల్లు అర్జున్..?

ఇప్పటికే అతను ఎన్నో సూపర్ హిట్ థ్రిల్లర్ స్టోరీస్ తీశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరో థ్రిల్లర్ కథ రెడీ చేశాడట.

Update: 2025-02-14 16:30 GMT

మలయాళంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు బసిల్ జోసెఫ్. ఓ పక్క డైరెక్షన్ చేస్తూ నటిస్తూ అదరగొట్టేస్తున్నాడు బసిల్ జోసెఫ్. యంగ్ ఏజ్ డైరెక్టర్ గా ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు బసిల్ జోసెఫ్. మలయాళ పరిశ్రమకు సరికొత్త హిట్ మిషన్ గా బసిల్ జోసెఫ్ అలరిస్తున్నాడు. తను చేస్తున్న సినిమాలన్నీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఐతే ఈ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది.

తెలుగు సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని భాషతో సంబంధం లేకుండా దర్శకులంతా కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బసిల్ జోసెఫ్ కూడా అల్లు అర్జున్ ని కలిసి ఒక థ్రిల్లర్ కథ చెప్పాడట. అల్లు అర్జున్ కూడా బసిల్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది.

ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. థ్రిల్లర్ కథల్లో బసిల్ జోసెఫ్ కు మంచి పట్టు ఉంది. ఇప్పటికే అతను ఎన్నో సూపర్ హిట్ థ్రిల్లర్ స్టోరీస్ తీశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరో థ్రిల్లర్ కథ రెడీ చేశాడట. ఫస్ట్ వెర్షన్ విన్న బన్నీ పాజిటివ్ గా స్పందించాడని టాక్. త్వరలోనే వీరిద్దరి మధ్య మరోసారి డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

పుష్ప 2 తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇక మీదట తను తీయబోయే సినిమాలన్నీ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీ, త్రివిక్రం వీరిద్దరిలో ఒకరితో అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మలయాళ దర్శకుడు రేసులోకి వస్తున్నాడు. మరి బన్నీ సినిమాల లైనప్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు.

మలయాళంలో అల్లు అర్జున్ కి సూపర్ క్రేజ్ ఉంది. బసిల్ జోసెఫ్ తో సినిమా అంటూ చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మరి అల్లు అర్జున్ బసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. తప్పకుండా ఈ కాంబో సినిమా పడితే మల్లూ ఫ్యాన్స్ తో పాటు నేషనల్ లెవెల్ ఆడియన్స్ కూడా సర్ ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News