ప్ర‌భాస్ ని వెన‌క్కి నెట్టే స్టార్ ఎవ‌రు?

మ‌రి ఈ రేంజ్ స్టార్ ని వెన‌క్కి నెట్టే స‌త్తా ఎవ‌రికుంది? ఆయ‌న‌తో స‌రిస‌మానంగా పోటీగా నిలిచేది ఎవ‌రు? అంటే కొంత మంది స్టార్ల‌ను ఉద‌హ‌రిం చొచ్చు.

Update: 2024-01-23 13:30 GMT

పాన్ ఇండియాలో ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `బాహుబ‌లి` త‌ర్వాత `సాహో`.. `రాధేశ్యామ్ `.. `ఆదిపురుష్` లాంటి సినిమాలు స‌రైన ఫ‌లితాలు సాధించ‌న‌ప్ప‌టికీ పాన్ ఇండియాలో ఆయ‌న మార్కెట్ ఎక్క‌డా కింగ‌లేదు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `స‌లార్ సీజ్ ఫైర్` బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్ల వ‌సూళ్ల‌తో డార్లింగ్ స‌త్తా ఏంటి? అన్న‌ది మ‌రోసారి రుజువైంది. `స‌లార్ -2`..`క‌ల్కి`..`స్పిరిట్` లాంటి చిత్రాలు డార్లింగ్ రేంజ్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేస్తాయ‌నే అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి.

మ‌రి ఈ రేంజ్ స్టార్ ని వెన‌క్కి నెట్టే స‌త్తా ఎవ‌రికుంది? ఆయ‌న‌తో స‌రిస‌మానంగా పోటీగా నిలిచేది ఎవ‌రు? అంటే కొంత మంది స్టార్ల‌ను ఉద‌హ‌రిం చొచ్చు. రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ ఇప్ప‌టికే `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండి యా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఇద్ద‌రు క‌లిసి న‌టించిన ఆ సినిమా 1300 కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. త్వ‌ర‌లో ఎవ‌రికి వారు సోలోగా పాన్ ఇండియాని షేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఆ చిత్రాల ద‌ర్శ‌కులు అంతే పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉన్న‌వారే. అలాగే `పుష్ప‌`తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేసులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా నార్త్ బెల్డ్ లో భారీ వ‌సూళ్ల‌ని సాధించ డంతో! అంత‌టి స‌త్తా ఉన్న హీరోగా బ‌న్నీ పాపుల‌ర్ అవుతున్నాడు. `పుష్ప‌-2` తో బ‌న్నీ పాన్ ఇండియా మార్కెట్ రెట్టింపు అవుతుంది అన్న అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. ప్ర‌స్తుతానికి ఈ ముగ్గురు హీరోలు బ‌న్నీకి పోటీగా పాన్ ఇండియా మార్కెట్ లో క‌నిపిస్తున్నారు.

ఈ హీరోల భ‌విష్య‌త్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఇంకా రివీల్ చేయ‌లేదు. ఏ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తారు? అవి రీజ‌నల్ గా ఉంటాయా? పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది తెలియ‌ని అంశం. డార్లింగ్ మాత్రం కల్కీ...స‌లార్-2..స్పిరిట్ అంటూ సంచ‌లన చిత్రాల‌తోనే ముందుకు రాబోతున్నారు.

Tags:    

Similar News