సౌత్ ఇండియాలో అల్లు అర్జున్‌ నెం.1

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ డం దక్కించుకున్న అల్లు అర్జున్‌ కి జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెల్సిందే

Update: 2024-03-21 08:03 GMT

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ డం దక్కించుకున్న అల్లు అర్జున్‌ కి జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెల్సిందే. పుష్ప సినిమాలోని పాటలు మరియు డైలాగ్స్ తో అద్భుతమైన పాన్ ఇండియా గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ కి సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది.

సౌత్‌ ఇండియాలో ఏ హీరోకు లేనంత మంది ఇన్ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ అల్లు అర్జున్‌ కి ఉన్నారు. హీరోల్లో కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ లోని మరే హీరోకి కూడా ఈ స్థాయి ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ లో లేరు.

అల్లు అర్జున్‌ 25 మిలియన్ ల ఫాలోవర్స్ తో నెం.1 స్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ 21.3 మిలియన్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా రామ్ చరణ్‌ (20.8 M), దుల్కర్ సల్మాన్‌ (14.1 M), యష్‌ (12.5 M), మహేష్ బాబు (13.4 M), ప్రభాస్‌ (11,7 M), విజయ్‌ (10.8 M) లు ఉన్నారు.

సినిమా విషయాలతో పాటు రెగ్యులర్‌ గా తన ఫ్యామిలీ విషయాలను మరియు ఇతర విషయాలను గురించి అల్లు అర్జున్‌ ఇన్‌ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. పుష్ప 2 లో ప్రస్తుతం బన్నీ నటిస్తున్నాడు. మరో సారి జాతీయ అవార్డు అందుకునే స్థాయిలో బన్నీ నటిస్తున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వీ కపూర్ తో ఐటెం సాంగ్ ను చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. పుష్ప 2 తర్వాత బన్నీ ఇన్‌ స్టా ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరగడం ఖాయం.. బాలీవుడ్‌ స్టార్స్ తో పోటీ పడటం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

Tags:    

Similar News