గురూజీకి అట్లీ అడ్డు తగులుతున్నాడా?
ఇప్పుడా సినిమాకి కొనసాగింపుగా రెండవ భాగంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని మించి రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
అల్లు వారి ప్లానింగ్ మారుతోందా? బన్నీ పాన్ ఇండియా సక్సెస్ ని కొనసాగించాలంటే అట్లీని దించాలా? ఇదే ఆలోచన ఇప్పుడు అల్లువారందరి బుర్రలు తొలిచేస్తుందా? అంటే అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్ లో నలుగుతోంది. `పుష్ప ది రైజ్` విజయంతో బన్నీ పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాడో తెలిసిందే. ఒక్క విజయం బన్నీని జాతీయ ఉత్తమ నటుడ్ని సైతం చేసింది. తెలుగు సినిమా నుంచి ఏ నటుడు సాధించని అరుదైన ఘనతని బన్నీ పుష్పతో సాధించాడు.
ఇప్పుడా సినిమాకి కొనసాగింపుగా రెండవ భాగంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని మించి రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచనాలున్నాయి. సక్సెస్ కొట్టేస్తుంది? అందులో ఎలాంటి డౌట్ లేదు అన్న ధీమాలో బన్నీ సహా అభిమానులు కనిపిస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా సక్సస్ ని తదుపరి కొనసాగించడం ఎలా? అంటే అందుకు ఆప్షన్ గా అట్లీ ఒక్కడే ఇప్పుడు బన్నీ ముందు కనిపిస్తున్నాడని కొత్త ప్రచారం ఊపందుకుంది.
వాస్తవానికి `పుష్ప-2` తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. కానీ బన్నీ ఇప్పుడున్న స్థితిలో త్రివిక్రమ్ కరెక్టేనా? అన్న కొత్త సందేహం అల్లు ఫ్యామిలీలో మొదలైనట్లు తాజాగా లీకులందుతున్నాయి. గురూజీ ఇంతవరకూ పాన్ ఇండియా సినిమా చేసింది లేదు. చేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ...ఎమోషన్ బేస్ చేసుకుని చేసిన చిత్రాలే. అవేవి కూడా పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యేవి కాదు. ఆయన ఏ సినిమాలోనూ యూనివర్శల్ అప్పీల్ అన్నది ఎక్కడా కనిపించదు.
కేవలం తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే ఇంతవరకూ సినిమాలు చేసారు. పాన్ ఇండియా స్టోరీ సిద్దం చేస్తే అది ఎంతవరకూ సంతృప్తిగా ఉంటుంది? అన్నది తెలియని అంశం. ఇలా ఇన్ని సందేహాల నేపథ్యంలో గురూజీతో ముందుకెళ్లడం కరెక్టేనా? ఆ స్థానంలోకి అట్లీని తీసుకురావడం సమంజసమా? అన్న ఆలోచనలో అల్లు ఫ్యామిలీ పడినట్లు సమాచారం. ఇప్పటికే అట్లీ -బన్నీ చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అట్లీ జవాన్ తో ఇండియానే షేక్ చేసాడు. షారుక్ ఖాన్ నే డైరెక్ట్ చేసాడు. ఇలా ఇంత ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో అట్లీని బన్నీ ఎందుకు వదులుకుంటాడు? అన్నది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే.