అల్లు అర్జున్ తో అంటే.. ఇద్దరికి 200 కోట్లకు పైనే..?

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు అందుకుంటున్న దర్శకులలో అట్లీ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు

Update: 2024-03-11 12:42 GMT

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు అందుకుంటున్న దర్శకులలో అట్లీ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో అతను చేసిన జవాన్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి 1000 కోట్ల రుచి చూసిన ఈ దర్శకుడు తదుపరి సినిమాను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నాడు.

ఇక ప్రస్తుతం అతని లిస్టులో అగ్ర హీరోలే ఉన్నారు. బాలీవుడ్ లో అయితే చాలామంది అట్లితో సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నారు. అతను అడిగితే డేట్స్ ఇవ్వడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు అని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ తో ఇదివరకే ఒక ప్రాజెక్టు ఉంటుంది అని క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే స్క్రిప్ట్ ఓకే అయ్యిందా లేదా అనే విషయంలో మాత్రం ఎలాంటి టాక్ అయితే బయటకు రాలేదు.

అల్లు అర్జున్ అయితే పుష్ప 2 తరువాత అట్లీతో సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత సినిమా తప్పకుండా అంతకుమించి అనేలా ఉండాలి.. అందుకే లిస్టులో త్రివిక్రమ్ ఉన్నప్పటికీ కూడా బన్నీ అట్లీని లైన్ లోకి తీసుకు వస్తున్నాడు. ఇక తర్వాత ఎలాగూ సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు. కాబట్టి పర్ఫెక్ట్ లైన్ అని అనుకుంటున్నాడు.

అయితే అల్లు అర్జున్ తో చేయబోయే అట్లీ సినిమాలను సన్ పిక్చర్స్ నిర్మించే అవకాశం ఉంది. అయితే ఇద్దరి పారితోషకాలు ఊహించని రేంజ్ లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అట్లీ అయితే దాదాపు 60 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో పాటు సినిమా విడుదలైన తర్వాత బిజినెస్ లో వాటా కూడా అడిగే విధంగా డీల్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడట.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తన పారితోషికాన్ని ఏకంగా 100 కోట్లు దాటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తప్పకుండా 700 కోట్లు రేంజ్ లో బిజినెస్ చేస్తుంది అని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. ఇక ఏమాత్రం వెయ్యి కోట్లు దాటిన బన్నీ రెమ్యునరేషన్ 120 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంటుంది.

దీంతో అట్లీ బన్నీ కలిస్తే ఈ ఇద్దరి పారితోషకాలే కోసమే సన్ పిక్చర్స్ దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. సినిమా బడ్జెట్ ఎంత లేదన్నా 250 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే అట్లే అల్లు అర్జున్ కాంబినేషన్ కోసం దాదాపు 450 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మరి ఇంత రిస్క్ సన్ పిక్చర్స్ తీసుకుంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News