బోయపాటికి అల్లు అర్జున్‌ ఓకే చెప్తాడా?

అంతే కాకుండా అర్జున్‌ రెడ్డి మేకర్‌ సందీప్ వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Update: 2023-11-25 05:41 GMT

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా సక్సెస్‌ తో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు. ఆయన సినిమాల లైనప్‌ చూస్తూ ఉంటే ఫ్యాన్స్ లో పట్టలేనంత సంతోషం కలుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌ తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్‌ అయింది. అంతే కాకుండా అర్జున్‌ రెడ్డి మేకర్‌ సందీప్ వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక భారీ సోషియో ఫాంటసీ సినిమా చేయాలని భావించాడు. అయితే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్‌ వచ్చే ఏడాదికి గాని బన్నీ సినిమా వర్క్ మొదలు పెట్టలేడట. ఇక బన్నీ కోసం రెడీ చేయబోతున్న సోషియో ఫాంటసీ కథ మరియు ఇతర వర్క్‌ కోసం త్రివిక్ర్మ్‌ ఏకంగా ఏడాదిన్నర సమయం తీసుకోబోతున్నాడట.

పుష్ప సినిమా విడుదల తర్వాత త్రివిక్రమ్‌ సినిమా చేయాలి అంటే చాలా నెలలు అల్లు అర్జున్‌ వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ గ్యాప్‌ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను అల్లు అర్జున్‌ చేయబోతున్నాడు అంటూ స్వయంగా బన్నీ వాసు ప్రకటించాడు. అది కూడా గీతా ఆర్ట్స్ లో ఉండే అవకాశం ఉందని కూడా ఆయన ఇండైరెక్ట్‌ గా చెప్పుకొచ్చాడు.

బన్నీ, బోయపాటి కాంబో లో చాలా ఏళ్ల క్రితం సరైనోడు సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి డిజాస్టర్‌ లను తీశాడు. అఖండ హిట్ అయినా కూడా ఇటీవల వచ్చిన స్కంద సినిమా నిరాశ పరిచింది. అయినా కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ సినిమా చేయాలి అనుకోవడం సాహస నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బోయపాటిని సరిగ్గా ఉపయోగించుకుంటూ అద్భుతమైన మాస్ సినిమా వస్తుందని గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌ వారు మాట్లాడుకుంటున్నారు. అందుకే బోయపాటి తో బన్నీ సినిమాను కన్ఫర్మ్‌ చేయడం జరిగిందని, పుష్ప 2 సినిమా విడుదలకు ముందే బోయపాటి తో బన్నీ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆలస్యం లేకుండా 2024 లోనే బన్నీ, బోయపాటి సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే ఇప్పటికి కూడా చాలా మంది ఫ్యాన్స్‌ నిజంగానే బోయపాటికి అల్లు అర్జున్‌ ఓకే చెప్పాడా అంటూ అనుమానంగా, ఆశ్చర్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వాసు తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు కనుక డౌట్ అక్కర్లేదు అనేది కొందరి మాట. త్వరలో మరింత క్లారిటీ వస్తుందేమో చూద్దాం.

Tags:    

Similar News