ఇక ఆ మ్యూజియంలో బన్నీ కూడా..
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో సౌత్ ఇండియా నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన బన్నీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గతేడాది పుష్ప సినిమాలోని తన యాక్టింగ్ కు గాను జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశారు.
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో సౌత్ ఇండియా నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియా హీరోగా బన్నీ నిలిచారు. ఇక రెండు, మూడు స్థానాల్లో స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం.. ఇన్ స్టాగ్రామ్ అల్లు డాక్యుమెంటరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న ఫస్ట్ యాక్టర్ బన్నీనే కావడం విశేషం.
తాజాగా అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలు ఉన్న దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువుదీరబోతోంది. అందుకోసం ఇప్పటికే అల్లు అర్జున్ విగ్రహం కోసం కొలతలు తీసుకున్నారు నిర్వాహకులు. మార్చి 28వ తేదీన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
అయితే ఈ విగ్రహం పుష్ప గెటప్ లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విగ్రహ ఆవిష్కరణ వేడుకకు అల్లు అర్జున్ హాజరవుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలు ఉన్నాయి. ఈ లిస్టులో బన్నీ కూడా చేరనున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. వరుస రికార్డులతో తగ్గేదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐకాన్ స్టారా మజాకా అంటూ సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప-2 మూవీతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బన్నీ. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరకు వచ్చింది. ఓవైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డితో వరుసగా సినిమాలు తీయనున్నారు. మరి వరుస చిత్రాలతో బన్నీ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.