డైరెక్టర్ చెప్పింది గుడ్డిగా ఫాలో అయ్యి ఇబ్బందుల్లో పడ్డా
అమలాపాల్ ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, తన వ్యక్తిగత అనుభవాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.;

అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న అమలాపాల్ సాధారణ ప్రేక్షకులతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని తనదైన సత్తా చాటుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు, సిరీస్‌లు చేసిన అమలాపాల్ నిర్మాతగా కూడా పలు ప్రాజెక్టులు చేసింది. అంత టాలెంట్ ఉన్న అమలాపాల్ తనకు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఏమీ తెలియదని, ఏ విషయంపై అవగాహన లేదని అంటోంది.
అమలాపాల్ ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, తన వ్యక్తిగత అనుభవాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. జీవితంలో తనకు ఎదురైన ఎదురుదెబ్బల నుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పిన అమలాపాల్ కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సింధు సమవేలి తన కెరీర్ ను, పర్సనల్ లైఫ్ ను చాలా ప్రభావితం చేసినట్టు చెప్పింది.
తండ్రి వయసున్న మామతో అక్రమ సంబంధం పెట్టుకునే కోడలు పాత్రలో అమలాపాల్ ఆ సినిమాలో నటించింది. దీంతో ఆ సినిమా రిలీజయ్యాక ఈ విషయం చాలా పెద్ద వివాదంగా మారిందని, ఆ వివాదం టైమ్ లో వచ్చిన వ్యతిరేకత తనను ఎంతగానో భయపెట్టిందని, ఆ మూవీ చూశాక తన తండ్రి చాలా బాధ పడ్డారని అమలాపాల్ చెప్పుకొచ్చింది.
ఆ సినిమా చేస్తున్నప్పుడు తన వయసు పదిహేడేళ్లని, ఆ పాత్ర చేయడం వల్ల తనకు సమాజంలో ఎలాంటి పేరొస్తుందో అని కూడా తాను అప్పుడు ఆలోచించలేదని, అలాంటి చెడ్డ పాత్రలను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని, ఆ పాత్ర తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో సినిమా రిలీజయ్యాకే అర్థమైందని, చిన్న వయసు కావడంతో డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయ్యానని తెలిపింది.
సింధు సమవేలిలో తాను చేసిన క్యారెక్టర్ వల్ల తర్వాతి సినిమా మైనా ఓపెనింగ్ ప్రమోషన్స్ కు కూడా తనను పిలవలేదని, ఈ విషయంలో రజినీకాంత్, కమల్‌హాసన్ నుంచి సైతం ఆమెకు కాల్స్ వెళ్లాయి. ఆ పాత్ర వల్ల వచ్చిన నెగిటివిటీ మీద ఉన్న భయం కారణంగా ఆమె చెన్నైకి కూడా వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి తాను మంచిపేరు తెచ్చుకోగా, తర్వాత కూడా ఆ సినిమా రీరిలీజై ఆమెకున్న స్టార్‌డమ్ పై ఎఫెక్ట్ చూపించిందని, అందుకే నటి ఎప్పుడైనా సవాళ్లను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని అమలాపాల్ చెప్తోంది.