అంబానీ బ్రదర్స్ నివాసాల విలువ 2000 కోట్లు
విలాసాలపై వారి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. కేవలం అంబానీ బ్రదర్స్ కి చెందిన రెండు ఇండ్ల విలువ సుమారు 2000 కోట్లు.
అంబానీ కుటుంబానికి చెందిన అత్యంత విలాసవంతమైన గృహాలు అన్ని వేళలా ప్రజల్లో చర్చనీయాంశం. ముఖేష్ అంబానీ రూ. 15,000 కోట్ల యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన గృహాల్లో ఒకటి... అనిల్ అంబానీ రూ. 5000 కోట్ల ఆంటిలియా టవర్.. ఇషా అంబానీ `గులిటా` భవంతి... వీటన్నిటి విలువ అక్షరాలా 2500 కోట్లు. అంబానీ కుటుంబ ఆస్తులు వారి అపారమైన సంపద, సంపన్న జీవనశైలికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ మూడు ఇల్లు నిలుస్తాయి. ప్రతి ఆస్తి విలాసవంతమైన సకల సౌకర్యాలతో తులతూగే భారీ భవంతులు. విలాసాలపై వారి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. కేవలం అంబానీ బ్రదర్స్ కి చెందిన రెండు ఇండ్ల విలువ సుమారు 2000 కోట్లు.
భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సుమారు 121 బిలియన్ డాలర్ల(10 లక్షల కోట్లు) నికర ఆస్తి విలువతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారుల్లో ఒకరిగా నిలిచారు. ఆసియాలో నంబర్ 1 ధనికుడిగా రికార్డులకెక్కారు. అతడి విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యంతో పాటు, అంబానీ అతడి కుటుంబం భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన స్థిరాస్తులను కలిగి ఉన్నారు. ఐకానిక్ యాంటిలియా నుండి సెన్సిటివ్ `గులిటా భవంతి` వరకు.. అంబానీ కుటుంబం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో వారి అపారమైన సంపదల్ని సంపన్న జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. అంబానీ కుటుంబానికి చెందిన అతి విలాసవంతమైన ఇళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే.. ఆశ్చర్యం గొలిపే నిజాలు ఎన్నో ఉన్నాయి. ముఖేష్ అంబానీ రూ. 15,000 కోట్ల యాంటిలియాలో నివశిస్తుండగా.. అనిల్ అంబానీ రూ. 5000 కోట్ల ఆంటీలియాలో నివశిస్తున్నారు.
యాంటిలియా: ఎ మార్వెల్ ఆఫ్ మోడర్న్ ఆర్కిటెక్చర్
ముఖేష్ అంబానీ - నీతా అంబానీ దక్షిణ ముంబైలోని 27-అంతస్తుల టవర్ అయిన యాంటిలియాలో నివసిస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 15,000 కోట్లు (2 బిలియన్ డాలర్లు). అమెరికన్ ఆర్కిటెక్చరల్ సంస్థ పెర్కిన్స్ & విల్ దీనిని రూపొందించింది. అత్యంత అధునాతన సాంకేతికతతో ఆస్ట్రేలియా లైటన్ హోల్డింగ్స్ నిర్మించింది. యాంటిలియా బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో తొమ్మిది హై-స్పీడ్ ఎలివేటర్లు, మూడు హెలిప్యాడ్‌లు, హెల్త్ సెంటర్, బాల్‌రూమ్, మినీ థియేటర్, యోగా స్టూడియో, స్నో రూమ్, బాబిలోన్-ప్రేరేపిత హాంగింగ్ గార్డెన్‌లు సహా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ విలాసవంతమైన నివాసం అంబానీ కుటుంబం లగ్జరస్ జీవనశైలికి చిహ్నంగా నిలుస్తుంది.
యాంటిలియాకు వెళ్లడానికి ముందు, అంబానీ కుటుంబం కోలాబాలోని 14-అంతస్తుల టవర్ అయిన సీ విండ్‌లో నివసించింది. ఈ ఆస్తిలో ముఖేష్ అంబానీ, అతడి తల్లి కోకిలాబెన్ అంబానీ, అతడి సోదరుడు అనిల్ అంబానీ .. వారి కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబ సభ్యుడు భవనంలోని పలు అంతస్తుల్లో నివసించారు.
2024లో అంబానీ సోదరీమణులు, నీనా కొఠారి , దీప్తి సల్గావ్కర్, వారి తల్లి ``కోకిలాబెన్ అంబానీ 90వ పుట్టినరోజు`` సందర్భంగా సీ విండ్‌లో గొప్ప వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. వారు ఈ సందర్భంగా పింక్ కలర్ దుస్తులను ధరించారు. ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ఇంటి ఖరీదు వందల కోట్లలో ఉంది.
అంబానీ కుటుంబం మూలాలు గుజరాత్‌లోని జునాగఢ్‌లోని చోర్వాడ్ అనే గ్రామంలో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జన్మస్థలమైన ఈ తీరప్రాంత గ్రామంలో వారికి పూర్వీకుల ఆస్తి ఉంది. ఈ ఆస్తి 1.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టూ పచ్చదనం నిండి ఉంది.
ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్:
గతంలో మంగరోల్వలనో డెలో అని పిలుచుకున్న ఆస్తిని రీమోడలింగ్ చేసారు. ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్ అని పేరు కూడా మార్చారు. ఇది ధీరూభాయ్ అంబానీ ఫౌండేషన్ నిర్వహణలోని ప్రైవేట్ ప్రాంతంగా, అలాగే పబ్లిక్ విభాగంగా విభజితమైంది. 2011లో గుజరాత్‌లో జరిగిన వేడుకలకు అంబానీ కుటుంబం హాజరై ఈ స్మారక ఇంటిని లాంచ్ చేసింది.
అనిల్ అంబానీ విలాసవంతమైన ఇల్లు:
అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తమ్ముడు అన్న సంగతి అందరికీ తెలుసు. ముంబై బాంద్రాలోని 17-అంతస్తుల టవర్ అబోడ్- ఆంటీలియాలో అతడు తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఈ విలాసవంతమైన ఆస్తి 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 70 మీటర్ల పొడవు ఉంటుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అబోడ్ విలువ దాదాపు రూ. 5,000 కోట్లు, ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటిగా నిలిచింది. అబాడ్‌లో అనిల్ అంబానీ .. అతడి భార్య టీనా అంబానీ విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తూ వ్యాయామశాల, హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
ఇషా అంబానీ సువిశాల భవనం:
ఇషా అంబానీ .. ముఖేష్ అంబానీ ఏకైక గారాల కుమార్తె. 12 డిసెంబర్ 2018న ఆనంద్ పిరమల్ ను ఇషా పెళ్లాడారు. ఆనంద్ పిరమల్ తల్లిదండ్రులు స్వాతి - అజయ్ పిరమల్‌లు `గులిటా` అనే సీఫేసింగ్ భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని వర్లీలో ఉన్న ఈ భవనాన్ని లండన్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ సంస్థ ఎకర్లీక్స్ కల్లాఘన్ రూపొందించారు.
గులిటా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని విలువ 450 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఐదు అంతస్తుల డైమండ్ షేప్ భవనంలో పెద్ద పచ్చిక స్థలం, భూగర్భ పార్కింగ్, ఆలయం, స్విమ్మింగ్ పూల్ సహా అనేక ఇతర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.