ఆ రెండు చిత్రాల్లో ర‌ష్మిక కూల్ గా!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా `పుష్ప` రిలీజ్ నుంచి బోల్డ్ బ్యూటీ గా ఫేమ‌స్ అయిపోయింది.

Update: 2024-12-23 00:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా `పుష్ప` రిలీజ్ నుంచి బోల్డ్ బ్యూటీ గా ఫేమ‌స్ అయిపోయింది. అటుపై రిలీజ్ అయిన `యానిమ‌ల్` లో గీతాంజ‌లి పాత్ర‌లో అంత‌కు మంచి బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేసింది. అనంత‌రం మ‌ళ్లీ `పుష్ప‌-2` కోసం రెట్టించి ప‌నిచేసింది. ఇలా మూడేళ్ల‌గా ర‌ష్మిక బోల్డ్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైంది. రొమాంటిక్ స‌న్నివేశాలు.. ఇంటిమే ట్ సీన్స్ కోసం బాండ్ అయింది. మ‌ళ్లీ `సికింద‌ర్` లో స‌ల్మాన్ ఖాన్ తోనూ అలాంటి స‌న్నివేశాల్లో క‌నిపించ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఈద్ వ‌ర‌కూ రిలీజ్ కాదు. ఈ మ‌ధ్య‌లో రెండు సాప్ట్ రోల్స్ క‌నిపిస్తున్నాయి. ధనుష్ హీరోగా న‌టిస్తోన్న `కుబేర‌`లో న‌టిస్తోంది. అలాగే `గ‌ర్ల్ ప్రెండ్` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో ర‌ష్మిక బోల్డ్ గా క‌నిపించే అవ‌కాశం లేదు. కుబేర కు శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ గా క‌నిపించే అవ‌కాశం ఏమాత్రం ఉండ‌దు. `కుబేర` గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ హీరోయిన్ పాత్ర విష‌యంలో క‌మ్ములా అలాంటి ఛాన్స్ తీసుకోరు.

హీరోయిన్ పాత్ర‌ని న‌ట‌న‌తో హైలైట్ చేస్తారు త‌ప్ప‌! అందాలు ఎర‌గా వేసి ఎన్ క్యాష్ చేసుకోవాల‌నుకోరు. ఇక `గ‌ర్ల ప్రెండ్` అన్న‌ది డిఫ‌రెంట్ మూవీ. ర‌ష్మిక పాత్ర‌నే సినిమాలో హైలైట్ అవుతుంది. అందులో ఆమెనే హీరో-హీరోయిన్. కాబ‌ట్టి ఆ పాత్ర‌ని ఎంతో హుందాగా చూపించ‌డానికే అవ‌కాశం ఉంటుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చిత్రాల్లో హీరోయిన్లు అంతా క్లీన్ గానే చూపించారు.

ఈ నేప‌థ్యంలో ర‌ష్మికని త‌న పాత్ర‌తో హైలైట్ చేస్తాడు త‌ప్ప‌! ర‌ష్మిక‌లో రొమాంటిక్ యాంగిల్ ని ట‌చ్ చేసే అవ‌కాశాలు చాలా త‌క్కువే. ఈ రెండు చిత్రాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. `సికింద‌ర్` తో పాటు ర‌ష్మిక బాలీవుడ్ లో `త‌మ్మా`లో కూడా న‌టిస్తోంది. ఈ సినిమా కూడా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ రెండు కూడా 2025లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Tags:    

Similar News