చెన్నైలో 'బాణం' గురి పెట్టిన వేదిక
తెలుగు, తమిళంలో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ఆశించిన స్టార్ డమ్ ని అందుకోకపోయినా నటిగా కెరీర్ పరంగా డోఖా లేని స్థితిలో ఉందిప్పుడు.
నారా రోహిత్ సరసన 'బాణం' చిత్రంలో నటించింది వేదిక. లారెన్స్ మాస్టర్ హారర్ మూవీ 'కాంచన'లోను నటించింది. తెలుగు, తమిళంలో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ఆశించిన స్టార్ డమ్ ని అందుకోకపోయినా నటిగా కెరీర్ పరంగా డోఖా లేని స్థితిలో ఉందిప్పుడు. వేదిక కొంత గ్యాప్ తర్వాతా కంబ్యాక్ అయిన తీరు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా చెన్నైలో ఓ ఈవెంట్ కి అటెండయిన వేదిక అల్ట్రా గ్లామరస్ స్టిల్స్ వెబ్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూశాక.. వజ్రాన్ని సాన బట్టే కొద్దీ మెరుపు పెరుగుతుంది! అన్న చందంగా వయసు పెరిగే కొద్దీ వేదిక అల్ట్రా గ్లామరస్ గా తయారవుతోంది అంటూ యూత్ కితాబిచ్చేస్తున్నారు.
ఇటీవలే వేదిక నటించిన 'ఫియర్' చిత్రం తమిళం, తెలుగులో విడుదలైంది. ఈ సినిమాలో వేదిక నటనకు ప్రశంసలు కురిసాయి. ఒకే ఏడాదిలో ఐదు సినిమాల్లో నటించానని, ఫియర్ చిత్రంతో సంవత్సరాన్ని ముగించడం గొప్ప బహుమతి అని అంది వేదిక. దేవుని దయతో కష్టపడి పని చేస్తే మాయాజాలం జరుగుతుంది. 2023 నుండి నా ప్రయాణంలో చాలా శ్రమించాను. నన్ను ఆదరించిన నా అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఒక సంవత్సరంలో ఐదు రిలీజ్‌లతో మీ ముందుకు రావడం నిజంగా ప్రత్యేకమైనది. ప్రతి ప్రాజెక్ట్ నటన పరంగా సవాల్ విసిరినప్పుడు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే అకాశం కలిగినప్పుడు ఆనందం కలుగుతుంది'' అని కూడా వేదిక తెలిపింది. ఇదే ఊపు నన్ను 2025లో మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుందని ఆశిస్తున్నానని కూడా అంది.
తాజాగా విడుదలైన ఫియర్ మానసిక ఆరోగ్య సమస్యలపై తెరకెక్కిన చిత్రం. చిన్నప్పటి నుంచి మానసిక సమస్యలతో సతమతమయ్యే సింధు పాత్రలో వేదిక నటించింది. తనను చంపడానికి ఎవరో వస్తున్నారని భయపడే పాత్ర అది. కథనం ముందుకు సాగేకొద్దీ కొద్దీ రహస్యం మరింత ఉత్కంఠ పెంచుతుంది. డిసెంబర్ చివరిలో వేదిక నటించిన మరో తమిళ చిత్రం విడుదలయ్యే ఛాన్సుందని సమాచారం.