అంబానీ పెళ్లి: రిహన్నకు 64 కోట్లు బీబర్‌కి 84కోట్లు
పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ కు ఏకంగా 84 కోట్లు (10 మిలియన్ అమెరికన్ డాలర్లు) చెల్లించినట్లు సమాచారం.
అంబానీ ఇంట పెళ్లిలో సంగీత్ కోసమే వందల కోట్లు ఖర్చవుతోంది. సంగీత్‌లో పాప్ స్టార్ల చిందుల కోసం ఏకంగా 200 కోట్లు పైగా ఖర్చు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు రిహాన్న లాంటి క్రేజీ పాప్ స్టార్ ఈ పెళ్లిలో తన ప్రదర్శన ఇవ్వడానికి ఏకంగా 64కోట్లు (8-9 మి.డాలర్లు) తీసుకుందని కథనాలొచ్చాయ. రిహన్న - కాటి పెర్రీ సహా బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ వారితో పాటు ప్రముఖ సంగీతకారులు ఇప్పటికే అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగుల్లో ఆలపించారు.
ఇప్పుడు పాప్ ఐకాన్ జస్టిన్ బీబర్ ఈ పెళ్లి కోసం భారత్‌లో అడుగుపెట్టాడు. ఈ శుక్రవారం నాడు అంబానీ-మర్చంట్ జంట సంగీత్ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి లాస్ ఏంజిల్స్ నుండి జస్టిన్ బీబర్ వచ్చాడు. ముంబై విమానాశ్రయం నుండి బీబర్ నిష్క్రమించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ కు ఏకంగా 84 కోట్లు (10 మిలియన్ అమెరికన్ డాలర్లు) చెల్లించినట్లు సమాచారం. తాజా కథనాల ప్రకారం.. అడెలె, డ్రేక్ , లానా డెల్ రే సహా ఇతర అంతర్జాతీయ సూపర్ స్టార్‌లు కూడా వారి ప్రదర్శనలతో సంగీత్ ను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. జూలై 12న ఈ పెళ్లి వేడుక జరగనుంది.
పాప్ స్టార్ల హంగామా ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ పెళ్లి సందడి అంబరాన్నంటింది. దేశ, విదేశాల నుంచి ఈ పెళ్లికి టాప్ సెలబ్రిటీలు అటెండవుతుండడంతో సర్వత్రా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. జామ్ నగర్ ప్రీ వెడ్డింగ్ లో పాప్ స్టార్ రిహన్న బృందం... ఆడమ్ బ్లాక్‌స్టోన్ (ఆస్కార్ విజేత, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్), J బ్రౌన్ (అమెరికన్ సింగర్ , సాంగ్ రైటర్) ప్రదర్శన ఇచ్చారు.
ఈ సంవత్సరం అతిపెద్ద వివాహాలలో ఒకటిగా అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. పెళ్లికి కేవలం కొద్దిరోజులే ఉంది గనుక పలువురు అంతర్జాతీయ అతిథులు ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారు. అమెరికన్ సింగర్ జె బ్రౌన్ , ప్రముఖ రాపర్ నిక్కీ మినాజ్, సంగీత దర్శకుడు ఆడమ్ బ్లాక్‌స్టోన్ కూడా జామ్ నగర్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఇటలీ క్రూయిజ్ షిప్ పార్టీలోను పలువురు ప్రముఖ పాప్ స్టార్లు కూడా తమ ప్రదర్శనలను ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి వేడుకలో జస్టిన్ బీబర్ తనదైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.