ఎల్లో ఫ్రాక్‌లో సీనియ‌ర్ బ్యూటీ హొయ‌లు

'బద్రి' చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచిత‌మైన బాలీవుడ్ బ్యూటీ అమీషా ప‌టేల్

Update: 2024-05-10 23:30 GMT

'బద్రి' చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచిత‌మైన బాలీవుడ్ బ్యూటీ అమీషా ప‌టేల్. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్, బాల‌కృష్ణ లాంటి అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బాలీవుడ్ కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. హిందీ, మ‌రాఠా చిత్రాల్లో న‌టిస్తూ బిజీ అయింది అమీషా.

ఇటీవ‌లే గ‌ద‌ర్ 2 (గ‌ద‌ర్ సీక్వెల్) ఘ‌న‌విజ‌యంతో మ‌రోసారి అమీషా పేరు మార్మోగింది. స‌న్నీడియోల్- అమీషా ప‌టేల్ జోడీకి కెరీర్ లో మ‌ర‌పురాని అపూర్వ విజ‌యం ద‌క్కింది. ఆ త‌ర్వాత ఎడాపెడా సినిమాల‌కు సంత‌కాలు చేసింది అమీషా. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోను ఈ బ్యూటీ మ‌రింత స్పీడ్ పెంచింది.

తాజాగా అమీషా ప‌టేల్ షేర్ చేసిన స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ బ్యూటీ సింపుల్ గా ఎల్లో టూపీస్ లో అందాలు ఆర‌బోసిన తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. అమీషా లేటు వ‌య‌సులో ఘాటు అందాలు ఎర వేస్తోంది!! అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌నం. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఈవెంట్ లో ప‌ట్టించుకోలేదు:

ముంబైలో జరిగిన ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2024కి బాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ స్టార్లు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. స్టార్ స్ట‌డెడ్ గ్లామర‌స్ ఈవెంట్‌లో అజయ్ దేవగన్, అనన్య పాండే, సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్, శ్రియా శరణ్, సన్నీ లియోన్, మలైకా అరోరా, త్రిప్తి డిమ్రీ, కార్తీక్ ఆర్యన్ త‌దిత‌రులు క‌నిపించారు.

రెడ్ కార్పెట్‌పై హంస న‌డ‌క‌ల‌తో హొయ‌లొలికించారు. అయితే ఈ ఈవెంట్లో మ‌లైకా అరోరా, పూజా హెగ్డే లాంటి క్రేజీ భామ‌లు అమీషాప‌టేల్ ని క‌నీస మాత్రంగా అయినా ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డంతో చిన్న‌బుచ్చుకుంద‌ని హిందీ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. పూజా హెగ్డే ఫోటో సెష‌న్ పూర్తి చేసిన వెంటనే దూరంగా ఉన్న‌ మలైకా వ‌ద్ద‌కు వెళ్లి కౌగిలించుకొని ప్రేమగా పలకరించింది. కానీ ఈ క్లిప్‌లో మలైకా, పూజా అమీషాను పలకరించలేదు.

Tags:    

Similar News