నిర్మాతగా ఆ స్టార్ హీరో వేగం పీక్స్ లో!
తాజాగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. నిర్మాత దినేష్ విజయన్ తో కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు.
'లాల్ సింగ్ చడ్డా' పరాజయంతో మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నటనకి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ సరైన కథ కుదిరే వరకూ అమీర్ భాయ్ సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకు ఎంత సమయమైనా పట్టొచ్చు. అప్పటివరకూ అభిమానులు వెయిట్ చేయక తప్పదు. అయితే నిర్మాతగా మాత్రం అమీర్ వేగం పీక్స్ లో నే ఉంది. సొంత బ్యానర్ లో ఇప్పటికే 'ది ఛాంపియన్స్'..'జయ జయ జయహే'..' ప్రతీమ్ ప్యారే'.. 'లాపతా లేడీస్'..'లవ్ టుడే' లాంటి సినిమాలు నిర్మిస్తున్నారు.
తాజాగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. నిర్మాత దినేష్ విజయన్ తో కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు. ప్రఖ్యాత న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవితాన్ని వెండి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉజ్వల్ నికమ్ దేశానికి ఎన్నో గొప్ప సేవలు అందించారు.
1993 ముంబై దాడుల బాంబు పేలుళ్లు.. గుల్షన్ కుమార్ హత్య కేసు..ప్రమోద్ మహజన్ కేసు..2008 ముంబై దాడుల కుసుల్లో నిందుతుల్ని జైళ్లకు పంపించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అలుపెరగకుండా శ్రమించారు.
అలాగే 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు.. 2016 కోపర్దీ రేప్..మర్డర్ కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్ గా పనిచేసారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా 2016 లో పద్మ శ్రీతో దేశం సత్కరించింది.
గతంలో మరాఠీ దర్శకుడు సువాహదాన్ ఆంగ్రే 2017 లో 'ఆదేశ్ -ది పవర్ ఆఫ్ లా' పేరుతో కోర్టు రూమ్ డ్రామాగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మరాఠీలో మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రంగానూ నిలిచింది. అయితే అమీర్ ఖాన్ ఉజ్వల్ నికమ్ మనోగతాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు.
ఆయన జీవితాన్ని..వృత్తిలో ఎదిగిన వైనం...గెలిచిన కేసులు...కోర్టులో ఎదుర్కున్న సవాళ్లు అన్నింటిని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఆయన జీవితంపై లోతైన అన్వేషణ చేసి ఈ కథని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.