జీవితం ఎన్నటికీ సులువు కాదు: అమితాబ్ బచ్చన్
జీవితంలో స్వీయానుభవాలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ లెజెండరీ అమితాబ్ బచ్చన్ గొప్ప స్ఫూర్తిని నింపుతున్నారు.
జీవితంలో స్వీయానుభవాలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ లెజెండరీ అమితాబ్ బచ్చన్ గొప్ప స్ఫూర్తిని నింపుతున్నారు. తీవ్రమైన అనారోగ్యం, తిరిగి చెల్లించలేనంత అప్పుతో లైఫ్ లో `దివాళా` అనే కఠోరమైన పరిణామాన్ని ఎదుర్కొని.. ఎంతో ఘోరమైన దశను చూసిన అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత ఊహించని విధంగా కంబ్యాక్ అయిన తీరు అందరికీ ప్రేరణనిస్తుంది. ఆయన అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఒక ట్వీట్ తో లేదా ఇన్ స్టా పోస్ట్ తో అతడిని డిఫైన్ చేయలేరు అభిమానులు. అందుకే ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఎపిసోడ్ తర్వాత అమితాబ్ చేసిన వ్యాఖ్య ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెలితే..
జీవితంలో కీలక దశ తర్వాత విడాకుల గురించి ప్రముఖ రచయిత చర్చకు అభిషేక్ బచ్చన్ `లైక్` కొట్టిన తర్వాత అమితాబ్ బచ్చన్ తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో `లైఫ్ ఈజ్ నెవర్ ఈజీ` అని స్పందించారు. అమితాబ్ బచ్చన్ తన X (గతంలో ట్విటర్) ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలను షేర్ చేసారు. ``జీవితం ఎన్నటికీ సులభం కాదు`` అనే సంక్లిష్ఠ అనుభవం గురించి మాట్లాడారు. అమితాబ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసి ఇలా రాసారు. ``T 5076 - … కష్టమైన పనికి తిరిగి వెళ్ళు .. కఠినమైనది .. కానీ జీవితం ఎప్పుడూ సులభం కాదు..`` అని రాసారు. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో వచ్చిన ఓ విడాకుల పోస్ట్‌ను `లైక్` చేసినందుకు హెడ్ లైన్స్‌కి రాగా.. రెండు రోజుల తర్వాత అమితాబ్ ఈ పోస్ట్ ను రాసారు.
అభిషేక్ లైక్ చేసిన పోస్ట్ వివరాల్లోకి వెళితే.. రచయిత్రి హీనా ఖండేల్వాల్ (ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్ట్, కాలమిస్ట్) ఒక పోస్ట్ ని సోషల్ మీడియాల్లో రాసారు. ``ప్రేమ లైట్ అయిపోయినప్పుడు... పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్నారు. వారి నిర్ణయానికి కారణం ఏమిటి .. గ్రే విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి?`` అని ప్రశ్నించారు. పెరుగుతున్న విడాకుల కేసులపై కథనం గురించి క్యాప్షన్‌తో ఫోటోని షేర్ చేసారు. అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో విడాకుల కష్టాలు, పెరుగుతున్న ట్రెండ్ గురించి చర్చలో భాగమయ్యాడు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ అనంత్ అంబానీ పెళ్లిలో ఒంటరిగా కనిపించిన కొద్ది రోజులకే అభిషేక్ ఆన్‌లైన్ లో విడాకుల కష్టాలపై చర్చను లైక్ చేయడం సందేహానికి తావిచ్చింది.
``విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ జంటలు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న ఆ హృదయాన్ని కదిలించే వీడియోలను మళ్లీ రూపొందించాలని కలలు కనేవారు ఇవేవీ ఊహించలేరు? అయినప్పటికీ కొన్నిసార్లు జీవితం మనం ఆశించినట్లుగా సాగదు. కానీ భార్యాభర్తలు దశాబ్దాల తర్వాత ఒకరి నుంచి ఒకరు విడిపోయినప్పుడు వారి జీవితంలో ఉద్విగ్నమైన భాగాన్ని పెద్ద, చిన్న విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి గడిపిన తర్వాత వారు విడిపోవటాన్ని ఎలా భరించగలరు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? విడిపోతే వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు?`` అంటూ రచయిత్రి హీనా ఖండేల్వాల్ ఆ పోస్ట్ లో చర్చించారు. దీనికి అభిషేక్ లైక్ కొట్టడంతో మీడియాలో అది పెద్ద చర్చకు తెర తీసింది. ఇప్పుడు అమితాబ్ తనదైన శైలిలో జీవితం గురించి వర్ణించారు.