కొడుకు-కోడలు విడాకుల వార్తలపై మెగాస్టార్ సీరియస్
భారతదేశం గర్వించదగ్గ స్టార్.. లెజెండరీ నటుడు.. దశాబ్ధాల పాటు పరిశ్రమకు సేవలందించారు.
భారతదేశం గర్వించదగ్గ స్టార్.. లెజెండరీ నటుడు.. దశాబ్ధాల పాటు పరిశ్రమకు సేవలందించారు. వెర్సటైల్ నటుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. కానీ ఆయన కుటుంబంపై మనసును కలచివేసే వార్తలు రాస్తూ నిరంతరం మీడియా కంటికి కునుకు లేకుండా చేసింది. దీనిపై ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. ఒకానొక సమయంలో చాలా సీరియస్ అయ్యారు కూడా. తన కొడుకు కోడలు విడిపోతున్నారంటూ కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్న హిందీ మీడియాపై ఆ నటుడి ఆవేదన నిజంగా హృదయాలను కలచివేస్తోంది.
ఇదంతా ఎవరి గురించి అంటే.. భారతీయ సినిమా మెగాస్టార్‌గా ఖ్యాతి ఘడించి 82 వయసులోను అద్వితీయమైన ప్రదర్శనలతో కట్టి పడేస్తున్న అమితాబ్ బచ్చన్ గురించి.. ఆయన కొడుకు కోడలు అయిన అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ గురించే ఇదంతా. ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ హిందీ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే దీనిని మొదటిసారి బచ్చన్ ఖండించారు. ఇవన్నీ `ధృవీకరణలు లేని అవాస్తవాలు` అని లెజెండరీ నటుడు కొట్టి పారేసారు. తన కుటుంబం, వ్యక్తిగత జీవితం గురించి గోప్యతను కొనసాగించాలనుకుంటున్నందున తన కుటుంబం గురించి మాట్లాడనని బిగ్ బి చెప్పారు.
నిజానికి ఈ పుకార్లు అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడివిడిగా అంబానీ వివాహానికి వచ్చినప్పటి నుండి మొదలయ్యాయి. అయితే బచ్చన్ కుటుంబం అన్ని ఊహాజనిత కథనాలపై గౌరవప్రదమైన మౌనాన్ని కొనసాగించింది. అమితాబ్ బచ్చన్ చివరకు తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో నిగూఢంగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వాటన్నింటినీ ప్రస్తావించారు. బ్లాగ్‌లో సుదీర్ఘమైన నోట్ రాసారు. ఊహాగానాల వెనుక ఉన్న నిజం గురించి కూడా ఆయన మాట్లాడారు. నేను కుటుంబం గురించి చాలా అరుదుగా మాట్లాడుతాను.. ఎందుకంటే అది నా డొమైన్.. దాని గోప్యత నేను మేనేజ్ చేస్తాను.. అవన్నీ ధృవీకరణలు లేకుండా అవి ఊహాజనిత అవాస్తవాలు..అని అన్నారు.
మీడియా వృత్తికి సంబంధించిన వారి వ్యాపారం.. ఎంపిక చేసుకున్న వృత్తిలో ఉండాలనే వారి కోరికను నేను సవాలు చేయను. సమాజానికి సేవ చేయడంలో వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తాను.. కానీ అవాస్తవాలు లేదా అనుమానాలు ఊహాజనిత వార్తలు సరికాదు... అని అన్నారు. అనుమాన అనే విత్తనం నాటకూడదని వ్యాఖ్యానించారు. ప్రశ్నార్థకంతో రాసేవారు.. పాఠకులు దానిని విశ్వసించాలని .. మరింత విస్తరించాలని చాలా రహస్యంగా కోరుకుంటున్నారు. తద్వారా మీ రచన రిపీటవుతుంది అని బిగ్ బి అన్నారు. క్వశ్చన్ మార్క్‌ని ఉపయోగించి రాయడాన్ని అవహేళన చేసారు బిగ్ బి. ఇలాంటి ప్రచారం చేసేవారికి మనస్సాక్షి ఉంటుందా? అని నిగూఢంగా వ్యాఖ్యానించారు.
అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నందున అతడిపై అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించారు. `ఐ వాంట్ టు టాక్` నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది.