వీరమల్లును పట్టించుకోకుండా.. 7/G అంటారెంటీ?
ఇక ఇప్పుడు ఏం రత్నం ఊహించని విధంగా 7/G బృందావన కాలనీకి సంబంధించిన సీక్వెల్ పనుల్లో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు ఖుషి సినిమాతో వఎనలేని గుర్తింపు అందుకున్న నిర్మాత ఏం రత్నం ఆ తర్వాత భారతీయుడు బాయ్స్ 7/G బృందావన కాలనీ అంటూ ఎన్నో విభిన్నమైన సినిమాలను నిర్మించారు. మొదట్లో అదృష్టం బాగానే లభించినప్పటికీ ఆ తరువాత కొడుకుల కారణంగా దారుణంగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. ఆయన రెండవ కుమారుడు రవికృష్ణ తో మొదట చేసిన 7/G బృందావన కాలనీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
అయితే మళ్లీ మరికొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ మరికొన్ని సినిమాలను నిర్మించారు. అయితే ఆ సినిమాలు నిర్మాతగా ఆయనకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇక మళ్లీ మొదటికి వచ్చిన ఆయన చిన్న చిన్న సినిమాలతో ప్రాఫిట్స్ అందుకునే ప్రయత్నం అయితే చేశారు.
ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను అవకాశాన్ని దక్కించుకున్నారు. దాన్ని హై రేంజ్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించాలని గట్టిగానే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరుగుతుందో బయటకు అసలు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ సినిమా పనులు మాత్రం ఆగిపోయాయి.
ఇక ఇప్పుడు ఏం రత్నం ఊహించని విధంగా 7/G బృందావన కాలనీకి సంబంధించిన సీక్వెల్ పనుల్లో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆ పాత సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయాలి అని 4K టెక్నాలజీతో అప్డేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఏం రత్నం పాల్గొన్నప్పుడు ఏదైనా హరిహర వీరమల్లు గురించి అప్డేట్ ఇస్తారేమో అని అందరు ఎదురుచూశారు.
కానీ ఆ సినిమా విషయంలో ఆయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు 7/G కి సంబంధించిన వ్యవహారాలతో బిజీగా ఉన్నా రత్నంపై సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు పాన్ ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇప్పుడు పాత సినిమా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ విషయంలో ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.