జీవితం అంటేనే సెలబ్రేషన్.. ఎమీజాక్సన్ పెళ్లి సందేశం!
అమీ జాక్సన్ - ఎడ్ వెస్ట్‌విక్ తమ వివాహ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ జంట తమ వివాహ వారాంతం నుండి వేడుకల చివరి దశ ఫోటోలు వీడియోలను షేర్ చేసారు.
ఏడుస్తూ జీవించడం ఎందుకు.. ఎప్పుడూ ఆనందంగా ఉండు! ఇదీ ఎమీ జాక్సన్ పెళ్లి సందేశం. మొదటిసారి ప్రేమలో పడింది. కానీ అతడు కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి వదిలేసాడు. ఒక బిడ్డకు జన్మనిచ్చాక లైట్ తీస్కున్నాడు. మనసారా ప్రేమించింది కానీ ఏం ప్రయోజం? గొప్ప బిలియనీర్‌ని పెళ్లి చేసుకోవాలన్న ఎమీజాక్సన్ కల నెరవేరలేదు. భారతదేశ సినీప్రియులు సహా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తనదైన అందం, ప్రతిభతో ఆకట్టుకున్న ఎమీజాక్సన్ కి వచ్చిన కష్టానికి చాలా మంది ఫ్యాన్స్ హర్టయ్యారు.
బ్రిటిన్ కి చెందిన బిలియనీర్ బిజినెస్ మేన్ జార్జి పనాయటౌ పెళ్లాడుతానంటూ ఆశించిన ఎమీకి తీవ్ర నిరాశ ఎదురైంది. చివరి నిమిషంలో అతడు బ్రేకప్ చెప్పడంతో ఎమీ జాక్సన్ చాలా కాలం పాటు ఇంగ్లండ్ వదిలి వెలుపలికి రాలేదు. ఇండియాలో స్టార్ గా గొప్పగా వెలిగిన కెరీర్ ని తిరిగి పునరుద్ధరింలేదు. అదంతా అటుంచితే ఇప్పుడు రెండో ప్రియుడు ఎడ్ వెస్ట్ విక్ మాత్రం అందుకు భిన్నంగా ఎమీజాక్సన్ కోరిక తీర్చాడు. అప్పటికే బిడ్డ ఉన్న ఎమీజాక్సన్ ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పాడు.
అమీ జాక్సన్ - ఎడ్ వెస్ట్‌విక్ తమ వివాహ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ జంట తమ వివాహ వారాంతం నుండి వేడుకల చివరి దశ ఫోటోలు వీడియోలను షేర్ చేసారు. వారు గియార్డిని డెల్ ఫ్యూయంటీలో వివాహ అతిథుల కోసం బీచ్ సైడ్ వీడ్కోలు బ్రంచ్ ని అద్భుతంగా ప్లాన్ చేసారు. ఇది నిజంగా చిల్లింగ్ ఈవెంట్. అతిథులు ఒక రేంజులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు వీక్షించాక.. నిత్యం ఆ ఏడుపుగొట్టు మొహాలు ఎందుకు.. చేస్తే ఇలా ఎంజాయ్ చేయాలి! అని అంగీకరిస్తున్నారు ఫ్యాన్స్. ఈ వారం ప్రారంభంలోనే అమీ- ఎడ్ వెస్ట్‌విక్ వివాహ రిసెప్షన్ నుండి పిక్చర్-పర్ఫెక్ట్ క్షణాలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ పోస్ట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్, జంట నృత్యం సహా ఆకట్టుకునే విషయాలెన్నో ఉన్నాయి.
అమీ జాక్సన్ 2010లో తమిళ చిత్రం `మద్రాసిపట్టణం`తో తెరకు పరిచయమైంది. మొదటి బాలీవుడ్ చిత్రం ప్రతీక్ బబ్బర్‌తో కలిసి ఏక్ దీవానా థా. రజనీకాంత్ రోబో డ్రామా 2.0లో కూడా అమీ జాక్సన్ నటించింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా నటించాడు. విక్రమ్ - శంకర్ కాంబినేషన్ ఐ సినిమాలోను ఎమీ కథానాయిక. మోడల్ కం నటి ఎమీజాక్సన్ తెలుగులో రామ్ చరణ్-బన్ని నటించిన `ఎవడు?`లో కథానాయికగా నటించింది. సింగ్ ఈజ్ బ్లింగ్ - ఫ్రీకీ అలీ లాంటి బాలీవుడ్ సినిమాలలోను నటించింది.