ఎమీ జాక్సన్ ముఖం సిలియన్ మర్ఫీలా మారిందేమిటీ?
తాజా పోస్ట్‌లో ఎమీ జాక్సన్ గుర్తించలేనంతగా మారిపోయి షాకిస్తోంది. దీనిపై యూత్ లో రకరకాల కామెంట్లు పడిపోతున్నాయ్. ఎమీజాక్సన్ ముఖకవళికలు, మారిన స్కెలెటిన్ రూపానికి నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
2.0- ఐ- ఎవడు వంటి చిత్రాల్లో నటించి ఎమీజాక్సన్ సౌత్‌లోను పాపులరైంది. ఈ బ్రిటీష్ బ్యూటీ దక్షిణాది పరిశ్రమల్లో కథానాయికగా అత్యుత్తమ స్థాయికి ఎదిగాక అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. బ్రిటన్ కి చెందిన ధనవంతుడు జార్జి పనాయటౌతో డేటింగ్ లో ఒక బిడ్డను కన్న ఎమీజాక్సన్ అతడిని పెళ్లి చేసుకోవాలని కలలు కంది. కానీ అవన్నీ కొంతకాలానికే ఆవిరైపోయాయి. ఆ తర్వాత మరో విదేశీ నటుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది.
ఇటీవలే తన ప్రియుడితో కలిసి ఎమీజాక్సన్ భారతదేశంలో అడుగుపెట్టడంపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు కోలీవుడ్ లో మళ్లీ ఎమీ బిజీ అయిపోయింది. మిషన్ చాప్టర్ 1: అచ్చం ఎంబతు ఇల్లయే అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు క్రేజీ సినిమాలకు సంతకాలు చేయడానికి సిద్ధమవుతోందని తెలిసింది. మరోవైపు సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ కోసం రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తున్న ఎమీజాక్సన్ తాజాగా ఊహించని కొత్త లుక్ తో ప్రత్యక్షమైంది.
తాజా పోస్ట్‌లో ఎమీ జాక్సన్ గుర్తించలేనంతగా మారిపోయి షాకిస్తోంది. దీనిపై యూత్ లో రకరకాల కామెంట్లు పడిపోతున్నాయ్. ఎమీజాక్సన్ ముఖకవళికలు, మారిన స్కెలెటిన్ రూపానికి నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ కొత్త రూపాన్ని ఐరిష్ నటుడు, 'ఓపెన్ హైమర్' (ఇటీవలి బ్లాక్ బస్టర్) ఫేం సిలియన్ మర్ఫీ రూపంతో పోల్చారు. రకరకాల ఈవెంట్లు, వేదికల నుంచి ఎమీజాక్సన్ ఫోటోలను జత చేస్తూ ఈ కొత్త రూపాన్ని షేర్ చేస్తున్నారు. ఇది కేవలం మేకప్ మాత్రమేనా లేదా అమీ జాక్సన్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందా? అనే చర్చ నెటిజనుల్లో ప్రారంభమైంది.
క్లోజ్-అప్ చిత్రాలలో ఒకదానిలో మెరిసే ఆకుపచ్చని కళ్ళు, ఎత్తైన చెంప ఎముకలతో వికృతంగా కనిపిస్తోంది. ఏదైనా అనారోగ్యంతో కునారిల్లిన వైనం కనిపిస్తోంది. పైగా ఒక ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌తో షాక్ కి గురి చేస్తోంది. ఇక రెడ్ హాట్ డిజైనర్ స్లిట్ డ్రెస్ లో ప్రత్యక్షమైన ఈ బ్యూటీ మారిన లుక్‌పై నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. "నేను సిలియన్ మర్ఫీని ఎందుకు చూస్తాను?" అంటూ హాలీవుడ్ నటుడితో పోలిక పెట్టారు. టామీ షెల్బీ (పీకీ బ్లైండర్స్లో సిలియన్ మర్ఫీ పాత్ర) ఎరుపు రంగులో బాగుంది! అంటూ కామెంట్ చేసాడు. ఈ కొత్త రూపాన్ని సిలియన్ మర్ఫీతో పోలుస్తూ వ్యాఖ్యల విభాగం నిండిపోయింది.
ఎమీ జాక్సన్ తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. మిస్ టీన్ లివర్‌పూల్ - మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ వంటి పోటీలలో విజేతగా నిలిచింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. 2010లో మిస్ లివర్‌పూల్ కిరీటాన్ని పొందింది. 2010లో విడుదలైన మద్రాసపట్టణం చిత్రంతో కోలీవుడ్ లో హీరోయిన్ గా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటుడు ఆర్య సరసన ఎమీ జాక్సన్ కనిపించింది. 2012లో ప్రతీక్ బబ్బర్‌తో కలిసి 'ఏక్ దీవానా థా' అనే హిందీ చిత్రంలో నటించింది. దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.
2014లో ఎవడు చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ - శృతి హాసన్‌లతో కలిసి నటించింది. 2012 చిత్రం తాండవంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటి (తమిళం) ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా ఎంపికైంది. ఈ సినిమాలో విక్రమ్, అనుష్క శెట్టితో అమీ జాక్సన్ కనిపించింది. CW ఛానెల్లో ప్రసారమైన 2017 సిరీస్ సూపర్‌గర్ల్ లో మొదటిసారి హాలీవుడ్ లో నటించింది. ఇమ్రా ఆర్డీన్ - సాటర్న్ గర్ల్ పాత్రను పోషించింది.