జంతు ప్రేమికుడితో ప్రేమ‌లో లైగ‌ర్ బ్యూటీ?

వాకర్ బ్లాంకో అత‌డి పూర్తి పేరు. ఇన్‌స్టా ప్రొఫైల్ ప్రకారం.. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చాడు.

Update: 2024-09-11 15:30 GMT

లైగ‌ర్ ఫేం అన‌న్య పాండే ఇటీవ‌లే ఆదిత్య రాయ్ క‌పూర్ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట బ్రేక‌ప్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. విడిపోయినా కానీ ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు స్నేహంగానే ఉన్నారు. ఇక బ్రేక‌ప్ త‌ర్వాత ఆదిత్య రాయ్ ఎవ‌రితో ప్రేమ‌లో ఉన్నాడో ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇప్పుడు అన‌న్య పాండే ఒక విదేశీ యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింద‌ని ప్ర‌చారం సాగుతోంది.

అన‌న్య ప్ర‌స్తుతం విదేశీ కుర్రాడు వాకర్ మధ్య ప్రేమాయణం గురించి గత కొన్ని వారాలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో వాకర్ అన‌న్య‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడ‌ని పుకార్ మొద‌లైంది. అయితే ఈ ఊహాగానాలపై అనన్య కానీ, వాకర్ కానీ స్పందించలేదు.

వాకర్ బ్లాంకో అత‌డి పూర్తి పేరు. ఇన్‌స్టా ప్రొఫైల్ ప్రకారం.. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చాడు. అంబానీల ఆధ్వర్యంలో గుజరాత్‌- జామ్‌నగర్‌లోని జంతు సంరక్షణ కేంద్రమైన 'వంటారా'లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అతడు ఇల్లినాయిస్‌లోని చికాగోకు చెందినవాడు. ఇల్లినాయిస్‌లోని వెస్ట్‌మినిస్టర్ క్రిస్టియన్ స్కూల్‌లో చదువుతున్నా కానీ, ప్రస్తుతం ఫ్లోరిడాలోని మయామిలో నివసిస్తున్నాడని అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్ వెల్లడించింది.

బ్లాంకో 2020లో జార్జియో అర్మానీ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ కోసం రన్‌వేపై నడిచిన మాజీ మోడల్. వన్యప్రాణుల ఔత్సాహికుడు బ్లాంకో ఇన్‌స్టాగ్రామ్ జంతువులపై అతడి అపార‌మైన‌ ప్రేమను ప్రదర్శించే పోస్ట్‌లతో నిండి ఉంది. అతడు పాములను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తాడు. చిలుకలు, కుక్కలు, నెమళ్లు సహా సరీసృపాలు, పక్షులు, ఇతర జీవుల ఫోటోలు, వీడియోలను కూడా అత‌డు నిరంత‌రం షేర్ చేస్తుంటాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే అనన్య‌ పాండే చివరిసారిగా కాల్ మీ బేలో కనిపించింది. ఈ సినిమా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. కొల్లిన్ డి కున్హా దర్శకత్వం వహించారు. త‌దుప‌రి విక్రమాదిత్య మోత్వానే CTRLలో కనిపిస్తుంది.

Tags:    

Similar News